English   

నయనతార అక్కడ హర్ట్ అయిందా.. అందుకే సైరా ప్రమోషన్స్‌కు నో..

nayan
2019-10-04 07:12:11

నయనతార సైరా ప్రమోషన్స్ కి ఎందుకు రావడం లేదు.. విడుదలకు ముందు అంటే ఏమో అనుకోవచ్చు కానీ విడుదల తర్వాత కనీసం ఒక్క ప్రెస్ మీట్ కు కూడా కేరళ కుట్టి రాలేదు. దానికి కారణాలేంటి.. ప్రస్తుతం మెగా అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా ఈ ప్రశ్నలకు సమాధానం తెలియక తలలు పట్టుకుంటున్నారు. కానీ దీని వెనక చాలా పెద్ద విషయం ఉంది.. కొన్ని బలమైన కారణాలు కూడా ఉన్నాయి. ఆమె రాకపోవడానికి ప్రధాన కారణం సినిమాలో తన పాత్రను అనుకున్న దానికంటే తక్కువ హైలైట్ చేయడం అని తెలుస్తుంది. ముందు నుంచి కూడా ఈ సినిమాలో తమన్నా చిన్న పాత్ర చేసింది.. నయనతార మెయిన్ హీరోయిన్ అని చెప్పుకుంటూ వచ్చారు దర్శక నిర్మాతలు. కానీ సినిమా విడుదలైన తర్వాత తమన్నా పాత్ర బాగా పేలింది..

ఆమె పోషించిన లక్ష్మీ పాత్ర అద్భుతంగా ఉందంటూ విమర్శకుల ప్రశంసలు కూడా అందుతున్నాయి. కానీ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి భార్య సిద్ధమ్మ పాత్ర మాత్రం పెద్దగా ప్రేక్షకులకు ఎక్కడం లేదు. ఈ పాత్రలో నయనతార నటించింది. దానికితోడు తమన్నా కంటే నయనతార స్క్రీన్ స్పేస్ కంటే చాలా తక్కువగా ఉంది. ఇవన్నీ తెలుసుకున్న తర్వాత నయనతార సైరా సినిమా ప్రమోషన్స్ ను వదులుకుందని ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతుంది. తన పాత్ర కనుక భారీగా ఉండి ఉంటే కచ్చితంగా ఈమె ప్రమోషన్స్ కి వచ్చి ఉండేదని.. కానీ సినిమాలో తన క్యారెక్టర్ తేలిపోయే సరికి రావాల్సిన అవసరం లేదని నయనతార నిర్ణయించుకుందని తెలుస్తోంది. ఈ విషయంపై రామ్ చరణ్ అడిగినా కూడా నో అనే సమాధానమే చెప్పింది కేరళ కుట్టి. ఒకటి రెండు సార్లు అడిగినా లేదని చెప్పేసరికి రామ్ చరణ్ కూడా లైట్ తీసుకున్నాడు.

More Related Stories