English   

చాణక్య సెన్సార్ టాక్...వర్కౌట్ అయినట్టే

Chanakya Censor
2019-10-04 09:48:27

ప్రస్తుతం హీరో గోపీచంద్ కెరీర్ గ్రాఫ్ ఏ మాత్రం ఆశాజనకంగా లేదు. అయినా ఆయన హీరోగా నటించిన స్పై థ్రిల్లర్ చాణక్య అక్టోబర్ 5న విడుదలవుతున్నది. ఒకవైపు సైరా రిలీజ్ అవుతుందని తెలిసినా సినిమా మీద నమ్మకమో ఏమో కానీ చాణక్య నిర్మాతలు ధైర్యంగా చిత్రాన్ని విడుదల చేయడానికి ముందుకు వచ్చారు. అయితే ఇక్కడ వారికి ధైర్యం ఏమిటంటే గోపీ చంద్ మార్కెట్ తో సంబంధం లేకుండా చాణక్య సినిమాకు బిజినెస్ బాగా జరిగింది. నాన్ థియేట్రికల్ రైట్స్ కిందే 15 కోట్ల వరకూ వచ్చాయని అంటున్నారు. అయితే తాజాగా ఈ సినిమా సెన్సార్ కూడా పూర్తి చేసుకుంది.

 సెన్సార్ రిపోర్ట్ ప్రకారం ఇండియా పాక్ బోర్డర్ లో చిత్రీకరించిన సన్నివేశాలు ఈ సినిమాలో హైలైట్ గా ఉంటాయట.  గోపీచంద్ నటించిన యాక్షన్ సీక్వెల్స్ బాగున్నాయని సెన్సార్ వాళ్ళ నుండి టాక్ వినిపిస్తోంది. అంతేకాక స్పై ఏజెంట్ గా గోపీచంద్ ఆకట్టుకున్నాడని సెన్సార్ టాక్ ను బట్టి తెలుస్తోంది. యాక్షన్, లవ్ ట్రాక్ రెండు సమపాళ్లలో ఉండడం వలన రెండూ వర్కౌట్ అయ్యాయని సెన్సార్ టాక్ ను బట్టి తెలుస్తోంది.  గోపీచంద్ 27వ సినిమాగా తెరకెక్కిన ఈ సినిమాలో మెహ్రీన్ హీరోయిన్.  తమిళ్ దర్శకుడు తిరు దర్శకత్వం వహించారు.  ఏకే ఎంటర్టైన్మెంట్ నిర్మించిన ఎలా ఉంటుందో తెలియాలంటే అక్టోబర్ 5 వరకు ఆగాల్సిందే.ఈ చిత్రానికి సెన్సార్ సభ్యులు U/A సర్టిఫికేట్ ఇచ్చి క్లియర్ చేసారు.
 

More Related Stories