English   

చిరంజీవికి షాకిచ్చిన జోకర్

Joker
2019-10-04 10:32:19

రెండు రోజుల క్రితం గాంధీ జయంతి సందర్బంగా మూడు భారీ సినిమాలు విడుదల అయ్యాయి. ఒకటి టాలీవుడ్, మరొకటి బాలీవుడ్ ఇంకొకటి హాలీవుడ్ వాటిలో మెగాస్టార్ సైరా నరసింహారెడ్డి, హృతిక్ రోషన్ టైగర్ ష్రాఫ్ ల మల్టీ స్టారర్ వార్ చిత్రాలతో పాటు జోకర్ ఉన్నాయి. ఆయితే విశేషం ఏమిటంటే ఈ మూడు సినిమాలు హిట్ టాక్ తెచ్చుకున్నాయి. సైరా, వార్ మరియు జోకర్ చిత్రాలకు పాజిటివ్ రివ్యూ రాడంతో పాటు, మౌత్ టాక్ కూడా బాగుండటంతో ఈ మూడు చిత్రాల మధ్య పోటీ రసవత్తరంగా మారింది. ఈ మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద క్లాష్ అయినప్పటికీ అడ్వాన్సు బుకింగ్ ల లోనే భారీగా వసూళ్లు రాబట్టాయి. 

అయితే నిన్న జరిగిన స్టంట్ మాత్రం రెండు ఇండియన్ సినిమాలకి షాక్ తగిలిందని చెప్పాలి. అదేంటంటే నిన్న చెన్నై సైరా, వార్ లకంటే జోకర్ మూవీ ఎక్కువ వసూళ్లు సాధించి ఝలక్ ఇచ్చింది. రెండవ రోజు చెన్నై నగరంలో జోకర్ చిత్రం 19లక్షల వసూళ్లు సాధించగా, సైరా మరియు వార్ చిత్రాలు సరిసమానంగా 14లక్షల వసూళ్లు రాబట్టాయని ట్రేడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం. ఇక వరల్డ్ వైడ్ గా జోకర్ మొదటిరోజు 5.4 మిలియన్ వసూళ్లు రాబట్టినట్టు అధికారిక సమాచారం. ఇది ఇండియా, కొరియా, ఇండోనేషియా, బెల్జియం దేశాలలో కలిపి ఈ ఈమొత్తాన్ని వసూలు చేసినట్టు చెబుతున్నారు.

More Related Stories