English   

ఎంగేజ్మెంట్ చేసుకున్న అర్చన

Archana gets engaged
2019-10-04 12:40:20

హీరోయిన్, నటి అర్చన వేద త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతోంది. తాజాగా ఆమె ఎంగేజ్‌మెంట్ జరిగింది. ఈ మధ్య సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలతోనే తాను ప్రేమలో ఉన్నానని చెప్పకనే చెప్పిన అర్చన నిన్న నిశ్చితార్థం కూడా చేసుకుంది. జగదీష్ అనే వ్యాపరవేత్తతో వేద ఏడడుగులు నడవబోతుంది. తన నుదుటిపై ముద్దు పెడుతున్న ఫోటోను అర్చన ఫేస్‌బుక్‌లో షేర్ చేసింది. కొన్ని రోజుల క్రితమే అర్చన తాను ప్రియుడితో కలసి ఉన్న ఫోటో షేర్ చేసి త్వరలోనే మీ అందరికి గుడ్ న్యూస్ చెబుతా అంటూ అభిమానులకు తెలియజేసింది. 

దీనితో అర్చన త్వరలో పెళ్లి పీటలెక్కబోతోందని అభిమానులు ఊహించారు. ఆమె ఇప్పుడు ఆ న్యూస్ చెప్పేసింది. ప్రముఖ హెల్త్‌కేర్ కంపెనీ ఉపాధ్యక్షుడు జగదీశ్‌తో అర్చన నిశ్చితార్థం నిన్న వైభవంగా జరిగింది. బంజారాహిల్స్‌లోని హోటల్ రాడిసన్ బ్లూలో జరిగిన ఈ కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. నటులు సుమంత్, నవ్‌దీప్, శివబాలాజీ, నటి మధుమిత తదితరులతోపాటు ఇరు కుటుంబాలకు చెందిన బంధువులు హాజరయ్యారు. అర్చన-జగదీశ్‌లు నిశ్చితార్థపు ఉంగారాలను ఒకరికొకరు తొడుక్కున్న తర్వాత వేద తల్లిదండ్రులు విజయ శాస్త్రి-సుధాకర్ శాస్త్రి, జగదీశ్ తల్లిదండ్రులు ప్రతిభ-భక్తవత్సలం దంపతులతోపాటు కార్యక్రమానికి హాజరైన బంధువులు, స్నేహితులు వారిని ఆశీర్వదించారు. అల్లరి నరేష్ సరసన `నేను` అనే చిత్రంతో కథానాయికగా తెరకు పరిచయం అయిన అర్చన అ తర్వాత కొన్ని సినిమాలు చేసినా కలసి రాలేదు. తెలుగు- తమిళం- కన్నడం- మలయాళ బాషలలో నటించినా ఎందుకనో కథానాయికగా ఎదగలేకపోయింది.

More Related Stories