English   

మీకు మాత్రమే చెప్తా..రిలీజ్ డేట్ ఇదే

Meeku Matrame Chepta
2019-10-04 13:29:40

మన టాలీవుడ్ లో కొత్తదానానికి పెద్ద పీటలు వేస్తున్నారు. కొత్త కథలని, కొత్త కథానాయకులని, నాయికలని, దర్శకులని పరిచయం చేస్తోంది మన టాలీవుడ్.  ఎప్పుడో మూడేళ్ళ క్రితం వచ్చిన పెళ్లి చూపులు సినిమా దగ్గర నుండి బ్రోచేవారెవరురా సినిమా వరకు అంత కొత్త దర్శకులు, కొత్త హీరోయిన్స్ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. తాజాగా తనకి హీరో గా హిట్ ఇచ్చిన డైరెక్టర్ ను హీరోగా పరిచయం చేస్త్హూ విజయ్ దేవరకొండ నిర్మాతగా కింగ్‌ ఆఫ్‌ ద హిల్‌ ఎంటర్‌టైన్మెంట్‌ పతాకంపై తీసిన సినిమా 'మీకు మాత్రమే చెప్తా' రిలీజ్‌కు రెడీ అయింది. 

తరుణ్‌ భాస్కర్‌, అభినవ్‌ గోమటం, అనసూయ భరద్వాజ్‌, వాణి భోజన్‌, నవీన్ జార్జ్ థామస్, పావని గంగిరెడ్డి, అవంతిక మిశ్రలు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాని షమ్మీర్‌ సుల్తాన్‌ డైరెక్ట్‌ చేశారు. ఫన్‌ అండ్ రొమాంటిక్ ఎంటర్‌ టైనర్‌గా రాబోతున్న ఈ సినిమా నవంబర్‌ 1న రిలీజ్‌ కాబోతుంది. మంచోడు అనే ఇమేజ్‌ని కాపాడుకునేందుకు ప్రతి మనిషీ ప్రయత్నిస్తుంటాడు. ఆ ఇమేజ్‌ని డామేజ్‌ చేసే చిన్న తప్పును దిద్దుకునే ప్రయత్నంలో ఎంత కామెడీ పండిందనే కాన్సెప్ట్ మీదే ఈ సినిమా ఉండనుందని అంటున్నారు. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ చివరి దశలో ఉన్న ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందనే నమ్మకంతో ఉంది యూనిట్. 

More Related Stories