English   

సైరా కలెక్షన్లతో చిరంజీవి నిజంగా హ్యాపీగా ఉన్నాడా..

Chiranjeevi
2019-10-04 18:31:13

సైరా సినిమా కు అద్భుతమైన టాక్ వచ్చింది.. మెగాస్టార్ చిరంజీవి నుంచి ఎలాంటి సినిమా అయితే ప్రేక్షకులు కోరుకుంటారో అలాంటి సినిమాతోనే వచ్చాడు అన్నయ్య. ఆయన రెండేళ్ల కష్టానికి సైరా నరసింహారెడ్డి నిదర్శనంగా నిలిచింది. అయితే ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినా కూడా కలెక్షన్ల విషయంలో మాత్రం అది కనిపించడం లేదు. ఇదే ఇప్పుడు దర్శక నిర్మాతలను కంగారు పెడుతున్న విషయం. మెగాస్టార్ చిరంజీవి లాంటి హీరోకు పాజిటివ్ టాక్ వస్తే కలెక్షన్లు దద్దరిల్లి పోవాలి.. బాక్సాఫీస్ బద్దలైపోవాలి.. కానీ సైరా విషయంలో మాత్రం అలా జరగడం లేదు. తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే సైరా నరసింహారెడ్డి సత్తా చూపిస్తున్నాడు. ఓవర్సీస్, ఇతర రాష్ట్రాల్లో సైరాకు అనుకున్నంత వసూళ్లు రాకపోవడం ఇప్పుడు నిర్మాతలను కలవరపెడుతున్న విషయం. ముఖ్యంగా యూఎస్ మార్కెట్ లో అనుకున్నదాని కంటే చాలా తక్కువ వసూళ్లు సాధిస్తుంది సైరా నరసింహారెడ్డి. దానికి కారణాలు కూడా లేకపోలేదు. అక్కడ హృతిక్ రోషన్ వార్ సినిమాతో పాటు హాలీవుడ్ మూవీ జోకర్ కూడా విడుదలైంది. దాంతో ఆ రెండు సినిమాల మధ్య లో సైరా నరసింహారెడ్డి నలిగిపోతున్నాడు. హిందీలో కూడా నామమాత్రపు వసూళ్లతోనే సరిపెట్టుకుంటున్నాడు సైరా. రెండు రోజుల్లో అక్కడ కేవలం 5 కోట్లు మాత్రమే వసూలు చేసింది సైరా నరసింహారెడ్డి. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రెండు రోజుల్లో 70 కోట్ల షేర్ వసూలు చేసింది. దాదాపు 100 కోట్లకు పైగా వసూలు చేస్తుందని అంచనా వేస్తే అంతకంటే తక్కువగానే తీసుకొచ్చి నిర్మాతలతో పాటు డిస్ట్రిబ్యూటర్లకు కంగారు పెడుతున్నాడు చిరంజీవి. మరి ఇప్పుడు సైరా నరసింహారెడ్డికి వస్తున్న కలెక్షన్లు చూసి చిరంజీవి నిజంగా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడా.. అంటే మనస్ఫూర్తిగా అవును అనే సమాధానం చెప్పడం కష్టమే అవుతుంది.

More Related Stories