English   

తండ్రి దగ్గరికి పవన్ పిల్లలు.. రేణు దేశాయ్ సంచలన నిర్ణయం..

Renu Desai
2019-10-04 19:12:52

పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి విడిపోయిన తర్వాత హైదరాబాద్ పూర్తిగా వదిలేసింది రేణుదేశాయ్. ఎప్పుడైనా తన పిల్లలకు చూడాలనిపిస్తే పవన్ కళ్యాణ్ ముంబై వెళ్తాడు. అక్కడే పూణేలో ఉండి రెండు మూడు రోజులు పిల్లలతో గడిపి మళ్ళీ హైదరాబాద్ వస్తాడు పవర్ స్టార్. ఇక్కడ ఆయనకు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. రేణూతో విడిపోయిన కూడా అఖిరా నందన్, ఆద్య బాధ్యతలను దగ్గరుండి చూసుకుంటున్నాడు పవన్ కళ్యాణ్. అయితే ఈ మధ్య కాలంలో మళ్ళీ హైదరాబాద్ కు దగ్గరవుతుంది రేణు దేశాయ్. ఇక్కడే మళ్ళీ సినిమా ఇండస్ట్రీతో మమేకం అవుతుంది. నటిగా రీ ఎంట్రీ ఇవ్వాలని కూడా చూస్తుంది. ఈ క్రమంలోనే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న టైగర్ నాగేశ్వర్ రావు బయోపిక్ లో హీరో అక్క పాత్రలో నటిస్తోంది రేణు దేశాయ్. దాంతో పాటు బుల్లితెర పై కొన్ని షోలకు జడ్జిగా కూడా వ్యవహరిస్తుంది. ఇవన్నీ ఇలా ఉంటే ఇప్పుడు ముంబై నుంచి హైదరాబాద్ కు మకాం మార్చాలని ప్రయత్నాలు చేస్తుంది రేణు దేశాయ్. ఈ క్రమంలోనే ఇక్కడే ఒక ఇల్లు తీసుకొని సెటిల్ అయిపోవాలనుకుంటుంది. ఇక్కడ ఉంటే పవన్ కు కూడా పిల్లలను కలవడానికి ఈజీగా ఉంటుందని భావిస్తోంది. దాంతో పాటు మెగా కుటుంబానికి పిల్లలను దగ్గర చేయాలని తన వంతు ప్రయత్నం చేస్తోంది ఈమె. ఒకవేళ ఇదే జరిగితే ఇకపై పిల్లలు పవన్ కళ్యాణ్ దగ్గరే ఉంటారు. అలాంటప్పుడు రేణు పరిస్థితి ఏంటి అనేది అగమ్యగోచరంగా మారింది. అప్పట్లో రెండో పెళ్లి చేసుకుంటుందని వార్తలు వచ్చినా కూడా ఇప్పటికీ దానిపై ఎలాంటి క్లారిటీ ఇవ్వడం లేదు రేణు. పెళ్లి చేసుకుంటుందా లేదా అనేది చెప్పడం లేదు. దాంతో అటు పెళ్లి చేసుకోక.. ఇటు పిల్లలు కూడా దూరమైతే రేణు దేశాయ్ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో ఆసక్తికరంగా మారింది.

More Related Stories