English   

అల్లు అరవింద్ పార్టీ అందుకే ఇచ్చాడా.. అసలు కారణం అదేనా..

Allu Arvind
2019-10-05 12:23:51

తన సినిమాలు విడుదలైనప్పుడు మాత్రమే ఎక్కువగా పార్టీ ఇస్తుంటాడు నిర్మాత అల్లు అరవింద్. సినిమా ఎలా ఉన్నా కూడా ప్రమోషన్స్ విషయంలో అసలు తగ్గడు. సరైనోడు లాంటి నెగిటివ్ టాక్ వచ్చిన సినిమా తొలి రోజు నుంచి ప్రమోషన్ చేసి చేసి చివరికి దాన్ని బ్లాక్ బస్టర్ చేసిన ఘనత అల్లు అరవింద్ సొంతం. అలాంటిదిప్పుడు బయట సినిమాకు ఈయన పార్టీ ఇస్తున్నాడు. సైరా నరసింహారెడ్డి చిత్ర విజయాన్ని అల్లు అరవింద్ సెలబ్రేట్ చేశాడు. అయితే ఉన్నట్టుండి చిరంజీవి సినిమా కోసం పార్టీ ఇవ్వడాన్ని అంతా ఆసక్తికరంగా చూస్తున్నారు. అల్లు అరవింద్ ఎందుకు ఈ పార్టీ ఇచ్చినట్టు అంటూ ఆరా తీస్తున్నారు. దీని వెనుక కూడా ఒక కారణం లేకపోలేదు. ఒకప్పుడు చిరంజీవి గీతా ఆర్ట్స్ లో వరుస సినిమాలు చేశాడు. అల్లు అరవింద్ నిర్మించిన సినిమాల్లో సగానికిపైగా చిరంజీవి హీరోగా నటించినవే. అప్పట్లో సొంత నిర్మాణ సంస్థలా గీతా ఆర్ట్స్ లో సినిమాలు చేసేవాడు మెగాస్టార్. కానీ ఇప్పుడు ఆయన సొంతంగా కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ పెట్టుకున్నాడు. రామ్ చరణ్ నిర్మాతగా అందులోనే వరుసగా సినిమాలు చేస్తున్నాడు మెగాస్టార్ చిరంజీవి. దాంతో ఇప్పుడు చిరంజీవిని ప్రసన్నం చేసుకోవడానికి అరవింద్ పార్టీ ఏర్పాటు చేశాడు అంటున్నారు ఇండస్ట్రీలోని ప్రముఖులు. అల్లు అరవింద్, అశ్వినీదత్ సహా ఇండస్ట్రీలో ఇంకా చాలా మంది నిర్మాతలు చిరంజీవి డేట్స్ కోసం చూస్తున్నారు. కానీ ఈయన మాత్రం కేవలం తన కొడుకు నిర్మాణంలోనే వరుస సినిమాలు చేస్తూ వస్తున్నాడు. దాంతో ఆయన డేట్స్ సంపాదించుకోవడానికి ప్రత్యేకంగా సైరా కోసం ఇలా అల్లు అరవింద్ ఒక పార్టీ ఏర్పాటు చేశాడంటూ ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. కనీసం ఇలాగైనా చిరంజీవి డేట్స్ పట్టుకొని మళ్ళీ ఆయనతో సినిమా నిర్మించాలని ఉంటున్నాడు ఈ మెగా ప్రొడ్యూసర్.

More Related Stories