English   

జగన్ పేరు చెప్పి పరిశ్రమలో అందర్నీ బెదిరిస్తున్నారు...బండ్ల గణేష్ సంచలనం 

 Bandla Ganesh vs PVP
2019-10-05 12:48:09

సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేష్‌పై జూబ్లీహిల్స్‌ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైన సంగతి తెలిసిందే. టెంపర్ సినిమాకు ఫైనాన్షియర్‌ గా వ్యవహరించిన ప్రోడ్యూసర్ పొట్లూరి వరప్రసాద్‌ ఇంటికి తన అనుచరులతో కలిసి వెళ్లిన బండ్ల గణేష్ పీవీపీ మీద దౌర్జన్యం చేసినట్టుగా కేసు నమోదయింది. జూబ్లీహిల్స్‌ పోలీసులు గణేశ్‌తో పాటు అతని అనుచరులపై ఐపీసీ 448, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.  తనపై కేసు నమోదైన విషయం తెలుసుకున్న బండ్ల గణేష్ పరారీలో ఉన్నారు. ఆయన కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. 

అయితే ఈ క్రమంలో సోషల్ మీడియాలో బండ్ల జగన్ కి తన బాధ చెప్పుకున్నారు. ఆయన ట్వీట్స్ యధాతధంగా "గౌరవనీయులైన గౌరవనీయులైన ముఖ్యమంత్రి జగన్ గారికి, సార్ మమ్మల్ని అందరినీ పివిపి బారి నుంచి కాపాడండి, అందరూ ఆంధ్రప్రదేశ్ లో అవినీతి లేని పాలన జరుగుతుందని ఆనంద పడుతూ ఉంటే, తులసివనంలో గంజాయి మొక్కలు వీరు చేస్తున్న క్రమంలో మీ పార్టీకి, నీకు చెడ్డ పేరు వస్తుంది. ఓడిపోయిన కేసులు కూడా మళ్లీ డబ్బులు కావాలి అని బెదిరించి మాట్లాడితే ఆంధ్ర ప్రదేశ్ నా చేతుల్లో ఉంది మీ అందర్నీ చంపేస్తాను అంటున్నాడు. రాజన్న రాజ్యం వచ్చిందని ఆనందంతో బతుకుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇలాంటి దుర్మార్గుడి చేతినుంచి కాపాడండి సార్. మీ పేరు చెప్పి చిత్రపరిశ్రమలో అందర్నీ బెదిరిస్తున్నారు దయచేసి కట్టడి చేయండి. అంటూ ట్వీట్ చేశారు. అలాగే ఆ ట్వీట్స్ అన్నిటిలో జగన్, సీఎంవోను కూడా ట్యాగ్ చేశారు.

More Related Stories