English   

సైరా కలెక్షన్లు తెలుగులో ఓకే.. కానీ అక్కడ మాత్రం.. 

Sye Raa
2019-10-05 15:54:07

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన సైరా నరసింహారెడ్డి సినిమా వసూళ్ల వర్షం కురిపిస్తుంది. కానీ తెలుగులో మాత్రమే. ఈ సినిమా భారీ అంచనాలతో విడుదలైంది. దేశవ్యాప్తంగా 5 భాషల్లో విడుదలైన సైరా రెండు భాషల్లో మాత్రమే సత్తా చూపిస్తుంది. తెలుగుతో పాటు కన్నడలో కూడా అదరగొడుతుంది సైరా. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు మూడు రోజుల్లో 54 కోట్లకి పైగా షేర్ వసూలు చేసింది. 108 కోట్లతో ఈ చిత్రం బరిలోకి దిగింది. ప్రస్తుతం దసరా సెలవులు కావడంతో కచ్చితంగా ఈ మార్క్ అందుకునేలా కనిపిస్తుంది సైరా. పైగా మూడు రోజుల్లోనే సగం తీసుకొచ్చాడు చిరంజీవి. కానీ మిగిలిన చోట్ల మాత్రం పరిస్థితి మరోలా ఉంది. హిందీలో కనీసం పట్టించుకోవడం లేదు ఈ చిత్రాన్ని. సైరా నరసింహారెడ్డికి అక్కడ ఊహించిన బ్రేక్ వేసింది వార్. హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ జోరు ముందు చిరు నిలబడలేకపోతున్నాడు. మూడు రోజుల్లో ఇప్పటి వరకు హిందీలో కేవలం 7 కోట్లు మాత్రమే వసూలు చేసింది ఈ చిత్రం. ఒక్క తెలుగు వెర్షన్ మాత్రమే చిరంజీవి ఇమేజ్ తో సంచలన వసూళ్లు తీసుకొస్తుంది. తమిళంలో కూడా విజయ్ సేతుపతి, నయనతార ఉన్నా ప్రయోజనం కనిపించడం లేదు. దాంతో దర్శక నిర్మాతలు కంగారు పడుతున్నారు. ఇప్పటికీ 120 కోట్లు వెనుకబడి ఉన్నాడు మెగాస్టార్. సైరా చివరివరకు ఏం చేస్తుందనేది చూడాలిక. 

More Related Stories