English   

మహేష్ బాబు రోజురోజుకీ కుర్రాడైపోతున్నాడుగా బాబోయ్.. 

Mahesh Babu
2019-10-05 17:22:15

వయసు 45.. ఇద్దరు పిల్లలకు తండ్రి.. ఇక అతన్ని అంకుల్ అనేయొచ్చు నో ప్రాబ్లమ్. నిజమే కానీ ఇది ఎవరి విషయంలో అయినా ఓకే అవుతుందేమో కానీ మహేష్ బాబు విషయంలో మాత్రం కాదు. ఈయన్ని అంకుల్ అంటే పెంకులు పగిలేవరకు కొడతారు అభిమానులు. ఇప్పుడు విడుదలైన వోగ్ మ్యాగజైన్ ఫోటోషూట్ చూసిన తర్వాత మహేష్ బాబును ఎవరైనా అంకుల్ అనాలనిపిస్తుందా.. అంటే అంత కంటే క్రైమ్ ఇంకోటి ఉంటుందా..? అసలు అందానికి అడ్రస్ ప్రూఫ్ అంటూ ఉంటే అది మహేష్ బాబు దగ్గరే ఉంటుందేమో అనేంతగా మేకోవర్ అయిపోయాడు ఈయన. ముఖ్యంగా చిన్న పిల్లాడిలా మహేష్ బాబు ఇచ్చిన పోజ్ ఇప్పుడు అభిమానులతో పాటు ప్రేక్షకులను కూడా మాయ చేస్తుంది. ఆయనతో పాటు దుల్కర్ సల్మాన్, నయనతార కూడా వోగ్ కోసం పోజులిచ్చారు. కానీ ఈ ముగ్గురులో మహేష్ బాబు ఒక్కడే హైలైట్ అయ్యాడు. ఆయన ఫోటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఏజ్ లో కూడా ఈ స్థాయి గ్లామర్ మెయింటేన్ చేయడం అనేది చిన్న విషయం కాదు. అందులో మహేష్ బాబును మించిన వాళ్లు లేరు. ఏదేమైనా రాజకుమారుడు అనే ట్యాగ్ లైన్ ను అలాగే కంటిన్యూ చేస్తున్నాడు సూపర్ స్టార్. ప్రస్తుతం సరిలేరు నీకెవ్వరు సినిమాతో బిజీగా ఉన్నాడు ఈయన. సంక్రాంతికి సినిమా విడుదల కానుంది. 

More Related Stories