English   

నాగార్జున చేస్తున్న పనులకు తల పట్టుకుంటున్న బిగ్ బాస్..

nag
2019-10-05 20:56:07

బిగ్ బాస్ సీజన్ తెలుగులో మొదలై రెండేళ్లు అయిపోయింది. ఇప్పటికే ఈ రెండు సీజన్స్ బాగానే గుర్తింపు తెచ్చుకున్నాయి. మూడో సీజన్ విజయవంతంగా 80 రోజులకు ఎంటర్ అవుతుంది. తొలి రెండు సీజన్లకు జూనియర్ ఎన్టీఆర్, నాని తమదైన శైలిలో హోస్టింగ్ చేసి ఔరా అనిపించారు. నాగార్జున కూడా ఇదే చేస్తున్నాడు. అయితే రేటింగ్స్ విషయంలో మాత్రం మూడో సీజన్ పోటీ పడలేకపోతుంది. దానికి నాగ్ హోస్టింగ్ కారణం.. దాని వెనక కూడా కొన్ని కారణాలున్నాయి. తొలి రెండు సీజన్లలో పోస్టులతో రాని సమస్య మూడో సీజన్లో నాగార్జునతో నిర్వాహకులకు వస్తుందని తెలుస్తోంది. నాగార్జునకు ఉన్న కొన్ని అలవాట్లు ఇప్పుడు బిగ్ బాస్ షో కు అడ్డంకిగా మారుతున్నాయి. ఈయన తన పర్సనల్ లైఫ్ ని త్యాగం చేయలేక బిగ్ బాస్ షో కోసం డేట్స్ ఎడ్జెస్ట్ చేయలేక తిప్పలు పడుతున్నాడు. ఇప్పుడు ఇదే ఇబ్బంది బిగ్ బాస్ నిర్వాహకులకు కూడా కనిపిస్తుంది. ఆ మధ్య ఒక సారి తన పుట్టినరోజు కోసం కుటుంబంతో పాటు వెళ్ళాడు నాగార్జున. అప్పుడు వేరే ఆప్షన్ లేక రమ్యకృష్ణని తీసుకొచ్చి ఒక హోస్టింగ్ చేయించాల్సి వచ్చింది.

ఇక ఇప్పుడు కూడా నాగార్జున వైపు నుంచి నిర్వాహకులకు ఇలాంటి ఇబ్బందులు తరచూ వస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా నాగార్జున వీకెండ్ పార్టీలకు ఎక్కువగా అటెండ్ అవుతూ ఉంటారు అని ఇండస్ట్రీ వర్గాలు చెబుతుంటాయి. ఇప్పుడు బిగ్ బాస్ షూటింగ్ కూడా వీకెండ్స్ లోనే ఉంటుంది. ఇదే పెద్ద తలనొప్పిగా మారుతోంది. సాధారణంగా శనివారం సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు బిగ్బాస్ ఎలిమినేషన్ ఎపిసోడ్ షూట్ చేస్తుంటారు. కానీ నాగార్జున కోసం శనివారం ఉదయం మొదలు పెట్టి మధ్యాహ్నంతో దీన్ని పూర్తి చేస్తున్నారు నిర్వాహకులు. దాంతో శనివారం సాయంత్రానికి ఎవరు ఎలిమినేట్ అవుతారు అనే విషయం బయటికి వచ్చేస్తుంది.

అలా చేయడంతో ఆదివారం ఎవరు బయటకు వెళ్తున్నారు అనేదానిపై అస్సలు ఆసక్తి లేకుండా మారిపోయింది. గత కొన్ని వారాలుగా ఇదే పరిస్థితి. అందుకే రెండు రోజుల ముందుగానే ఎవరు బయటికి వచ్చి చేస్తున్నారు అనేది తెలిసిపోవడంతో అది షో రేటింగ్స్ పై కూడా ప్రభావం చూపిస్తుంది. కానీ నాగార్జునకు ఎదురు చెప్పలేక బిగ్ బాస్ నిర్వాహకులు కూడా మౌనంగా దీన్ని భరిస్తున్నారని తెలుస్తోంది. మరి దీనికి పరిష్కారం ఎక్కడ దొరుకుతుందో చూడాలి..

 

More Related Stories