English   

అలా అయితే సినిమాలు మానేస్తా....తాప్సీ సంచలనం

Taapsee Pannu.jpg
2019-10-05 23:58:37

తాప్సీ బోల్డ్‌ నెస్ కి మారు పేరు. డేరింగ్‌గా మాట్లాడుతుంది. ఎవరేమన్నా స్ట్రాంగ్‌ రిప్లై ఇస్తుంది. అలాంటి హీరోయిన్ వేదింపులు భరించలేక యాక్టింగ్‌కి గుడ్‌బై చెప్పేస్తానని స్టేట్‌మెంట్స్ ఇస్తోంది. తాప్సీ రెండు వైపులా పదునున్న కత్తిలాంటి ఆర్టిస్ట్. గ్లామర్‌ డాల్‌ గా మెప్పిస్తూనే గన్ను పట్టి బుల్లెట్లు కురిపిస్తుంది. "పింక్, నామ్‌షబానా, బద్‌లా' లాంటి సినిమాలతో సూపర్‌ యాక్ట్రెస్‌ అనిపించుకుంది. అలాంటి హీరోయిన్ ఇప్పుడు విమర్శలు తట్టుకోలేక, యాక్టింగ్‌కి గుడ్‌బై చెబుతానంటోంది. తాప్సీ ప్రస్తుతం "సాండ్‌ కీ ఆంక్' అనే సినిమాతో బిజీగా ఉంది. అక్టోబర్‌ 24న ఈ మూవీ రిలీజ్‌ కాబోతోంది. ఇందులో తాప్సీ అరవై ఏళ్ల షూటర్‌గా నటించింది.

ఈ క్యారెక్టర్‌నే చాలామంది విమర్శిస్తున్నారు. తాప్సీ ఏ మాత్రం బామ్మలా కనిపించడం లేదని, వాయిస్‌, వాకింగ్ లో ఈమె చాలా యంగ్‌గా ఉందని కామెంట్‌ చేస్తున్నారు. కంగన రనౌత్‌ సిస్టర్ రంగోళి అయితే ప్రొస్థెటిక్‌ మేకప్‌ వేసుకున్నంత మాత్రాన ఆర్టిస్టులు కాలేరని ట్వీట్‌ చేసింది. ఇవన్నీ భరించలేక తాప్సీ కూడా ఫైర్ అయ్యింది. ఏం చెయ్యమంటారు నన్ను యాక్టింగ్ మానెయ్యమంటారా.. ప్రయోగాలు చెయ్యకూడదా.. కొత్త క్యారెక్టర్స్‌ గురించి ఆలోచించొద్దా అని వాపోయింది. ఇక ఆ విషయం పక్కన పెడితే సాండ్‌ కి ఆంక్‌ మూవీ టీమ్‌ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడిని కలిసింది. ఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిసి సినిమా నేపథ్యం గురించి వివరించారు.

More Related Stories