English   

ఏడాది చివర్లో సినిమాల జాతర.. సంక్రాంతికి ముందు రచ్చే..

dec
2019-10-06 05:51:56

దసరా సీజన్ ను చిరంజీవి ఒక్కడే తీసుకున్నాడు. దివాళికి ఎవరూ రావడం లేదు. దాంతో ఇప్పుడు అందరి కన్ను డిసెంబర్ పై పడింది. సాధారణంగా అయితే డిసెంబర్ అన్ సీజన్ కాబట్టి ఎవరూ రారు. కానీ సంక్రాంతికి భారీ సినిమాలు పోటీలో ఉన్నాయి. దాంతో పూర్తైన సినిమాలు విడుదల చేయడానికి డిసెంబర్ ఒక్కటే అనువైన సమయం అని భావిస్తున్నారు దర్శక నిర్మాతలు. లేదంటే మళ్లీ సమ్మర్ వరకు వేచి చూడక తప్పదు. అందుకే ముందుగానే తమ సినిమాలన్నింటిని తీసుకొస్తున్నారు. డిసెంబర్ నుంచే ఈ జాతర మొదలు కానుంది. ఇప్పటికే మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు, బన్నీ అల వైకుంఠపురములో.. కళ్యాణ్ రామ్ ఎంత మంచివాడవురా.. రజినీకాంత్ దర్బార్ లాంటి సినిమాలు సంక్రాంతికే వస్తున్నాయి. ఇక అంతకు మించిన పోటీ నెల ముందే జరగనుంది.

రవితేజ డిస్కోరాజా.. నితిన్‌ భీష్మ.. శర్వానంద్ 96.. సాయి ధరమ్ తేజ్ ప్రతీరోజు పండగే లాంటి సినిమాలన్నీ డిసెంబర్ లోనే విడుదల కానున్నాయి. ఇందులో రవితేజ, నితిన్ లాంటి హీరోలు తమ సినిమాల విడుదల తేదీలు కూడా కన్ఫర్మ్ చేసారు. ఇప్పుడు వెంకటేష్ వెంకీ మామ.. బాలయ్య కేయస్ రవికుమార్ సినిమాలు కూడా డిసెంబర్ లోనే విడుదల చేయాలని చూస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. దివాళికి అనుకున్నా కూడా షూటింగ్ కాకపోవడంతో డిసెంబర్ లో రావాలని చూస్తున్నాడు వెంకటేష్. ఇక కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో బాలయ్య నటిస్తున్న సినిమా కూడా డిసెంబర్ టార్గెట్‌గానే రెడీ అవుతుంది. మొత్తానికి సంక్రాంతికి ముందే బాక్సాఫీస్ వార్ దారుణంగా జరుగుతుంది. మరి ఇందులో ఎవరిది పై చేయి అవుతుందో చూడాలిక.

More Related Stories