English   

త్రివిక్రమ్, చిరంజీవి సినిమా ఎలా ఉండబోతుందో తెలుసా..

srinivas
2019-10-06 06:31:13

ఇంతకీ చిరంజీవి ఎన్ని సినిమాలు చేస్తున్నాడు.. సగటు సినిమా ప్రేక్షకుడికి వస్తున్న అనుమానం ఇదే. పదేళ్ల గ్యాప్ తర్వాత వచ్చిన అన్నయ్య ఖైదీ నెంబర్ 150తో ఇంకా ఉన్నాన‌ని గుర్తు చేసాడు. ఇప్పుడు సైరాతో కూడా కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నాడు మెగాస్టార్. ఈ సినిమా సెట్స్ పై ఉన్నపుడే మరో రెండు సినిమాలు క‌మిటయ్యాడు చిరంజీవి. ఇప్పటికే కొరటాల శివ మెగాస్టార్ కోసం క‌థ సిద్ధం చేస్తున్నాడు. ఈ సినిమా వచ్చే నవంబర్ నుంచి పట్టాలెక్కి.. వచ్చే ఏడాది దసరా నాటికి విడుదల కానుంది. మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్స్ తో కలిసి రామ్ చరణ్ ఈ చిత్రాన్ని తన కొణిదెల బ్యానర్ పైనే నిర్మించ‌నున్నాడు. కొరటాల సినిమా తర్వాత బోయపాటి కూడా కథ పట్టుకొని సిద్ధంగానే ఉన్నాడు. అయితే ఈయన త్వరలోనే బాలకృష్ణతో సినిమా చేయబోతున్నాడు. ఇప్పట్లో బోయపాటి సినిమా ఉండటం కష్టమే. దాంతో ఈయన స్థానంలో ఇప్పుడు మరో దర్శకుడికి కమిట్మెంట్ ఇచ్చాడు మెగాస్టార్.

ఆయ‌నే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఈయ‌న‌తో చిరంజీవి 153వ సినిమా ఉండబోతుంది. ఈ విషయం చెప్పింది కూడా మరెవరో కాదు.. స్వయంగా మెగాస్టార్. తమ కాంబినేషన్ కలిపింది రామ్ చరణ్ అంటూ అభిమానుల ముందు అసలు విషయం చెప్పాడు చిరంజీవి. అందుకే తనయుడికి థాంక్స్ కూడా చెప్పాడు చిరు. తనకు మంచి దర్శకున్ని త‌న‌యుడు ఇచ్చాడ‌ని మురిసిపోయాడు ఈ హీరో. వచ్చే ఏడాది చివర్లో త్రివిక్రమ్- చిరంజీవి సినిమా ప‌ట్టాలెక్కే అవకాశం ఉంది. ప్రస్తుతం బన్నీ హీరోగా అల వైకుంఠపురములో సినిమా చేస్తున్నాడు ఈయన. ఇది పూర్తైన తర్వాత చిరు సినిమాపై దృష్టి పెట్టనున్నాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. గతంలో మెగాస్టార్ నటించిన జై చిరంజీవ సినిమాకు కథ, మాటలు అందించాడు మాటల మాంత్రికుడు.

More Related Stories