English   

తనకిష్టమైన ప్లేస్ లో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న మహేష్

Mahesh Babu
2019-10-06 11:43:13

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న సరిలేరు నీకెవ్వరు చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతున్న సంగతి తెల్సిందే. అయితే ఈ షెడ్యూల్ షూటింగ్ కు బ్రేక్ రావడంతో ఎప్పుడు వెకేషన్ కి వెళ్దామా అని రెడీగా ఉండే మహేష్ బాబు ఫ్యామిలీతో కలిసి దుబాయ్ చెక్కేసాడు. ఇక దసరా సెలవుల్ని స్విట్జర్లాండ్‌లో మహేష్ ఫ్యామిలీతో కలిసి సరదాగా ఎంజాయ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఫోటోల్ని మహేష్ సోషల్ మీడియాలో తన అభిమానులకు షేర్ చేశారు. ‘భూమిపై నాకు ఇష్టమైన ప్రాంతం స్విస్ ఆల్ప్స్. దసరా సందర్భంగా వచ్చిన షార్ట్ బ్రేక్‌ను ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నా. 

రెట్టింపు ఉత్సాహంతో తిరిగి వస్తా’అంటూ మహేష్ బాబు తాజాగా ట్వీట్ చేశారు. ఈ షూట్ బ్రేక్ దొరికీ దొరకగానే పిల్లలు గౌతమ్‌, సితార, భార్య నమ్రతతో కలిసి మహేష్ స్విట్జర్లాండ్‌ వెళ్లారు. స్విట్జర్లాండ్‌కు వెళ్లిన తర్వాత మహేశ్‌ అక్కడి స్విస్‌ ఆల్ప్స్‌ దగ్గర తీసుకున్న ఫొటోను శనివారం సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న సరిలేరు నీకెవ్వరు సినిమాలో మహేష్ బాబు సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. విజయశాంతి కీలక పాత్రలో నటిస్తోన్న ఈ సినిమా సంక్రాంతికి విడుదల కానుంది.

More Related Stories