English   

చాణక్య ఫస్ట్ డే కలెక్షన్స్

Chanakya
2019-10-06 12:11:41

హీరో గోపీచంద్ నటించిన లేటెస్ట్ మూవీ చాణక్య నిన్న విడుదలైంది. ఇక ఈ సినిమాకి మొదటి ఆట నుండి మిశ్రమ స్పందన లభించింది. సినిమాకి యావరేజ్ రేటింగ్స్ వచ్చినా గోపీ చంద్ నటనకి మంచి ప్రసంశలు దక్కుతున్నాయి. అయితే ఈ సినిమా రిలీజ్ అయినా సరే సైరా ప్రభంజనం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు కలెక్షన్స్ కోసం చాణక్య సినిమా చాలా కష్టాలే పడిందని చెప్పాలి. రెండు తెలుగు రాష్ట్రాలలో మెగాస్టార్ సినిమా సైరా పోటి లో ఉండటం తో చాణక్య సినిమా ఆ పోటికి నిలబడ లేక పోయింది, దాంతో చాలా చోట్ల ఓపెనింగ్స్ లో చాలా తక్కువ వసూళ్లు నమోదు. 

మొత్తం రెండు తెలుగు రాష్ట్రాలలో సుమారు 450 వరకు థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ సినిమా మొత్తం మీద సినిమా మొదటి రోజు ఆక్యుపెన్సీ 30% కన్నా తక్కువే ఉంనట్లు సమాచారం. దాంతో బాక్స్ ఆఫీస్ దగ్గర ఫస్ట్ డే కోటి నుండి 1.2 కోట్ల మేర షేర్ ని నమోదు చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఇక వరల్డ్ వైడ్ గా సినిమా మొదటి రోజు 1.4 కోట్ల దాకా షేర్ ని సాధించే అవకాశం ఉందని అంటున్నారు. అయితే అధికారిక సమాచారం వస్తే కానీ ఏమీ చెప్పలేని పరిస్థితి. అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 11 కోట్లకు పైగా కావడంతో బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే 12 కోట్ల దాకా షేర్ రాబట్టాల్సిన అవసరం ఉంది. అయితే ఈ సినిమా ఎంతవరకు ఈ టార్గెట్ ని అందుకుంటుంది అనేది తెలియాల్సి ఉంది. ఇక దసరా సెలవులలో అయినా ఆ కలెక్షన్స్ ఏమయినా పెరుగుతాయో లేదో చూడాలి. 

More Related Stories