English   

ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరంటే

Mahesh Vitta
2019-10-06 12:34:24

బిగ్ బాస్ లో ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరు అనేది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఈ వారం హౌజ్ నుండి ఎలిమినేట్ అవ్వడానికి నామినేట్ అయిన సభ్యులు రాహుల్, పునర్నవి, మహేష్, వరుణ్ సందేశ్. అందరూ స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ కావడంతో ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది ఆసక్తికరంగా మారింది. అయితే అందుతున్న తాజా సమాచారం ప్రకారం ఈ వారం మహేష్ విట్టా ఎలిమినేట్ కాబోతున్నాడని సమాచారం. ఇప్పటికే హౌజ్ లో నుండి ఎలిమినేట్ కావడానికి చాలా సార్లు నామినేట్ అయిన మహేష్ ప్రతీ సారీ సేవ్ అవుతూ వచ్చాడు. అయితే ఈసారి మాత్రం మహేష్ బయటకి రాక తప్పదని అంటున్నారు. నిజానికి వరుణ్ సందేష్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నాడు. అతను ఫైనల్స్ కు వెళ్లడం దాదాపు ఖాయమయినట్టే. 

అలాగే రాహుల్, పునర్నవి జంటగా ఉండి గిల్లికజ్జాలు పెట్టుకుంటున్నారు కాబట్టి జనాలు బాగా చూస్తున్నారనే కారణంతో బిగ్ బాస్ వాళ్ళని అప్పుడే విడదీయకపోవచ్చు. ఇక నిన్న వితిక మెడల్ సాధించడంతో బిగ్ బాస్ హౌస్‌లో సంబరాలు నిర్వహించారు. మోడల్స్‌తో డాన్స్‌లు, కేక్ కటింగ్‌లు, సన్మానాలు, సత్కారాలు. బాబాని తోసేసి గేమ్ గెలిచిన వితికాను ఫైనల్ వరకూ తిరుగులేకుండా ముందుకు పంపారు బిగ్ బాస్. అంతే కాక ఆమెకు ప్రత్యక్ష అధికారాలు ఇచ్చి ఎలిమినేషన్‌లో ఉన్న కంటెస్టెంట్‌ను సేవ్ చేసే అధికారం కూడా ఇవ్వచ్చని, అలా ఈ వారం వితికాకు మెడల్ ఇచ్చిన పునర్నవిని కాపాడేలా చేశారని అంటున్నారు. ఈ క్రమంలో మహేష్ విట్టా ఇంటి నుండి ఎలిమినేట్ అవ్వడం ఖాయంగా ఉంది.

More Related Stories