నితిన్ సినిమాకి ఆసక్తికర టైటిల్

ఈ ఏడాది ఎన్టీఆర్ తో పాటు సినిమా రిలీజ్ చేయని మరో కుర్ర హీరో నితిన్. అప్పుడెప్పుడో ఏడాది క్రితం శ్రీనివాస్ కల్యాణంతో వచ్చిన ఈ కుర్రహీరో ఇంతవరకు మరి సినిమా రిలీజ్ చేయలేదు. ఈ ఏడాది గ్యాప్ వచ్చినా దీన్ని భర్తీ చేస్తూ 2020లో మూడు సినిమాలతో రావడానికి ఫ్లాన్ వేస్తున్నాడు. నితిన్ కి 2016లో వచ్చిన అఆ తర్వాత హిట్ దక్కలేదు. మధ్యలో వచ్చిన మూడు సినిమాలూ ఫ్లాప్ కావడంతో శ్రీనివాస కల్యాణం తర్వాత గ్యాప్ తీసుకున్నాడు.
ఏ కథ ఎంచుకోవాలన్న డైలమాలోఆర్నెల్లు గడిచిపోయింది. ఆతర్వాత ఛలో తీసిన వెంకీ కుడుములకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా సినిమా సెట్స్‌పైకి రావడానికి మరో ఆరు నెలలు పట్టింది. ఏడాది విరామం తర్వాత వెంకీ దర్శకత్వంలో ""భీష్మ'' సినిమా చేస్తున్నాడు నితిన్. భీష్మ సెట్స్‌పైకి రాకుండానే.. మరో రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు నితిన్. తొలిప్రేమ... మిస్టర్ మజ్ను తీసిన వెంకీ అట్లూరి దర్శకత్వంలో నటిస్తాడు నితిన్. ఈ సినిమాకు రంగ్‌దే అన్న టైటిల్ కూడా పెట్టేశారు.
సినిమా పూర్తి కావస్తున్నా టైటిల్ దొరక్క కొందరు హీరోలు ఇబ్బందిపడుతుంటే నితిన్‌కు మాత్రం టైటిల్స్ ఇట్టే దొరికేస్తున్నాయి. సినిమా మొదలుకాకుండానే... టైటిల్స్ రిజిష్టర్ చేసేస్తున్నారు. చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో నటించే మూవీ చెస్ బ్యాక్‌డ్రాప్ కథ కావడంతో.. "చదరంగం'' టైటిల్ ను ఫైనల్ చేశారని అంటున్నారు. ఇక ఈ సినిమాలో రకుల్, ప్రియా వారియర్ హీరోయిన్స్‌గా నటించే అవకాశం ఉందని అంటున్నారు. ఈ సినిమా 2020 సమ్మర్‌కి రాబోతుందని అంటున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. చంద్రశేఖర్ యేలేటి సినిమాలలో మిస్టరీ, సస్పెన్స్ తప్పకుండా ఉంటాయి. మరి ఈ చిత్రాన్ని ఎలా తెరకెక్కిస్తాడో చూడాలి.