English   

పోటీ పడి మరీ బరువు తగ్గుతున్న స్టార్ హీరోలు

Chiranjeevi Balakrishna.jpg
2019-10-07 00:41:22

ఆ ఇద్దరి వయసూ 60 దాటినా మనసులు మాత్రం ముప్పై ఏళ్ళు. అయితే మనసు 30లో వున్నా వయసు మాత్రం పెరిగిపోతోంది. వయసు కనిపించకుండా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కెమెరాకు మాత్రం దొరికిపోతున్నారు. ఇలా కెమెరా ముందు వయసు కనిపించకుండా వుండడానికి ఇద్దరు సీనియర్‌ హీరోలు వెయిట్‌ తగ్గుతున్నారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 15 నుంచి 25  కేజీలు వెయిట్‌ లాస్‌ అవుతున్నారు. 60 ప్లస్‌లో కష్టపడుతున్న ఆ హీరోలు మరెవరో కాదు బాలయ్య చిరంజీవిలు. సైరా నరసింహారెడ్డిలో బొద్దుగా కనిపించిన చిరంజీవి కొరటాల శివ మూవీకోసం ఇప్పటికే వెయిట్‌ తగ్గాడు.

వయసు రీత్యా జిమ్‌లో కసరత్తులు మంచిదికాదన్న వుద్దేశంతో ఆయుర్వేద ట్రీట్‌మెంట్‌తో స్లిమ్‌గా తయారయ్యాడట. వెయిట్‌ తగ్గాల్సిందేనని కొరటాల పట్టుపట్టడంతో 64 ఏళ్ల వయసులోనూ ఆయన నోరు కట్టుకోక తప్పట్లేదు. మరోపక్క బోయపాటి శ్రీను బాలయ్యను కంట్రోల్లో పెట్టాడు. ఇప్పటికే జిమ్‌లో వర్కవుట్స్ స్టార్ట్‌ చేసిన బాలకృష్ణ బోయపాటి మూవీ కోసం 20 నుంచి 25 కేజీలు తగ్గనున్నాడు. సింహా కోసం వెయిట్‌ తగ్గి మీసాలు డిఫరెంట్‌గా పెంచిన బాలకృష్ణ లెజెండ్‌ దగ్గరకొచ్చేసరికి మరోసారి లుక్‌ మార్చేశాడు. కష్టాల్లో వున్న ప్రతిసారీ హిట్‌ ఇచ్చిన బోయపాటి మాట తీసేయలేక 20 కేజీలు తగ్గుతున్నాడు బాలయ్య. నిండుగా కనిపించే ఈ  నందమూరి హీరో 20 కేజీలకు పైగా తగ్గితే ఎలా వుంటాడో చూడాలి మరి.

More Related Stories