అభిమానులకు దసరా సర్ ప్రైజ్ ఇస్తున్న వెంకీ మామ..

తెలుగులో ఇప్పుడు మల్టీస్టారర్ సినిమాలు చాలానే వస్తున్నాయి. ముఖ్యంగా సీనియర్ హీరోలు వీటిని బాగానే ఎంకరేజ్ చేస్తున్నారు. వెంకటేష్ చేసిన ఎఫ్ 2 కానీ.. చిరంజీవి సైరా కానీ అన్నీ మల్టీస్టారర్ సినిమాలే. ఇదే దారిలో ఇప్పుడు వెంకీ మరో మల్టీస్టారర్ చేస్తున్నాడు. మేనల్లుడు నాగచైతన్యతో తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు వెంకటేష్. ప్రేమమ్ లో కాసేపు మామగా కనిపించి మాయం అయిపోయాడు వెంకటేష్. ఇప్పుడు పూర్తిగా రచ్చ చేయడానికి రెడీ అవుతున్నారు. ఈ ఇద్దరూ కలిసి నటిస్తున్న సినిమా వెంకీమామ. ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. దసరా సందర్భంగా అభిమానులకు సర్ ప్రైజ్ ఇవ్వడానికి సిద్ధమయ్యారు ఈ హీరోలు.
అక్టోబర్ 7 ఉదయం 11 గంటలకు టీజర్ అప్ డేట్ ఇవ్వబోతున్నారు దర్శక నిర్మాతలు. దీనికి సంబంధించిన పోస్టర్ విడుదలైంది. అక్టోబర్ 8న టీజర్ విడుదల కానుంది. జై లవకుశ తర్వాత ఏడాదికి పైగా గ్యాప్ తీసుకుని బాబీ చేస్తోన్న సినిమా ఇది. పూర్తిగా గ్రామ నేపథ్యంలో సాగే కథ ఇది. ఇందులో చైతూకు జోడీగా రాశీ ఖన్నా.. వెంకీకి జోడీగా పాయల్ రాజ్ పుత్ నటిస్తున్నారు. ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్టైనర్ గా వెంకీ మామాను తెరకెక్కించనున్నాడు దర్శకుడు బాబీ. ఈ సినిమాకు కూడా కోన వెంకట్ తన రచనా సహకారం అందించాడు. ఈ సినిమాతో కచ్చితంగా బ్లాక్ బస్టర్ అందుకుంటామని ధీమాగా చెబుతున్నారు మామా అల్లుళ్లు.