రామ్ గోపాల్ వర్మ చాలా బ్యూటీఫుల్ అబ్బా..

2019-10-07 09:37:41
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో రొమాంటిక్ సినిమాతో వస్తున్నాడు. ఈయనకు ఏదొచ్చినా ఆపడం కష్టమే. ఒకసారి పూర్తిగా రక్తచరిత్ర తీస్తాడు.. మరోసారి పూర్తిగా రొమాంటిక్ తీస్తాడు.. ఇప్పుడు కూడా ఇదే చేస్తున్నాడు ఈయన. వర్మ తన సినిమాకు బ్యూటిఫుల్ అనే టైటిల్ పెట్టాడు. అది కూడా ట్రిబ్యూట్ టు రంగీలా అనేది ట్యాగ్ లైన్. నైనా కథానాయికగా, సూరి కధానాయకుడిగా నటిస్తున్నారు ఇందులో. లక్ష్మీస్ ఎన్టీఆర్ తెరకెక్కించిన అగస్త్య మంజు దీనికి దర్శకుడు. టైగర్ కంపెనీ ప్రొడక్షన్ పతాకంపై నిర్మాణమవుతున్న రామ్ గోపాల్ వర్మ చిత్రమిది. టి.అంజయ్య సమర్పణలో టి.నరేష్ కుమార్, టి.శ్రీధర్ నిర్మిస్తున్నారు. వైవిధ్యభరిత అంశాలతో ఆకట్టుకోనున్న ఈ చిత్రం ట్రైలర్ అక్టోబర్ 9 ఉదయం 9 గంటలకు విడుదల కానుంది. ఈ చిత్రానికి పాటలను సిరా శ్రీ అందించగా.. సంగీతాన్ని రవి శంకర్ సమకూరుస్తున్నారు.