చాణక్య కలెక్షన్స్.. గోపీచంద్ కెరీర్లో మరో ఫ్లాప్..

విడుదలైన రెండు రోజులకే ఫ్లాప్ అని తేల్చడం పెద్ద విషయమే. కానీ చాణక్య విషయంలో మాత్రం ఇది ప్రూవ్ అయిపోయింది. తిరు తెరకెక్కించిన ఈ సినిమా వైపు ప్రేక్షకులు అస్సలు కదలడం లేదు. కనీసం కలెక్షన్లు కూడా కోరుకున్నట్లు రావడం లేదు. కథ మరీ రొటీన్ కావడం.. దానికితోడు రొటీన్ స్క్రీన్ ప్లే ఉండటంతో చాణక్యతో డిస్ కనెక్ట్ అయిపోతున్నారు ఆడియన్స్. తొలిరోజు కేవలం 1 కోటి 20 లక్షలతో సరిపెట్టుకున్న చాణక్య.. రెండో రోజు షేర్ లక్షల్లోకి వచ్చేసాడు. ఇదే ఇప్పుడు బయ్యర్లను భయపెడుతుంది. సినిమాలో గోపీచంద్ తన పాత్ర వరకు చంపేసాడు.. ఈ పాత్ర కోసమే పుట్టాడా అనేంతగా ఇందులో ఒదిగిపోయాడు. రా ఏజెంట్ గా ప్రాణం పెట్టి నటించాడు. పాకిస్తాన్ కూడా వెళ్లి అక్కడ ఔరా అనిపించాడు. కానీ కథ సహకరించకపోతే పాపం ఆయన మాత్రం ఏం చేస్తాడు..? ఇప్పుడు చాణక్య విషయంలో ఇదే జరుగుతుంది. సినిమాకు నెగిటివ్ టాక్ రావడం.. పైగా సైరా థియేటర్లలో ఉండటంతో గోపీచంద్‌కు మరో షాక్ తప్పేలా లేదు. మొత్తానికి రెండు రోజుల్లో ఈ చిత్రం కేవలం 3 కోట్లు మాత్రమే వసూలు చేసింది. 12 కోట్లకు పైగా బిజినెస్ చేసిన చాణక్య సేఫ్ అవ్వడం ఇప్పుడు దాదాపు అసాధ్యంగా కనిపిస్తుంది.