English   

రచ్చ రేపుతున్న బాలయ్య లుక్

balakrishna
2019-10-07 17:31:26

బాలయ్య ఫ్యాన్స్‌కు ఆయన మూవీ టీమ్ సర్‌ప్రైజ్ ఇచ్చింది. బాలయ్య, కె.ఎస్.రవికుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘NBK 105’ నుండి ఇప్పటి వరకు రిలీజ్ చేసిన పోస్టర్స్‌కి భారీ స్పందన వచ్చింది. 59 ఏళ్ల వయసులో బాలయ్య హాలీవుడ్ హీరో లుక్ లోకి మారిపోవడం చూసి అందరూ సర్‌ప్రైజ్ అవుతున్నారు. ఇక ఈరోజు విజయదశమి సందర్భంగా ప్రేక్షకులకు శుభాకాంక్షలు తెలుపుతూ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. ఆ లుక్‌లో బాలయ్య కత్తి పట్టుకున్న టామ్ క్రూస్ లా ఉన్నాడని అంటున్నారు. ఎదో హోమం చేస్తుండగా జరిగే ఫైట్‌లో బాలయ్య ఇలా కత్తి పట్టుకుని ఉగ్రనరసింహావతారంలో కనిపించినట్టు చెబుతున్నారు. ముఖం నిండా పసుపుకుంకుమలు వేసుకుని ఉన్న బాలయ్య లుక్ ఇప్పుడు రచ్చ రేపుతోంది.

 వేదిక, సోనాల్ చౌహాన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో పాత్ర కోసం 11 కేజీల బరువు కూడా తగ్గిపోయాడు బాలయ్య. నిజానికి టాలీవుడ్ హీరోలలో బాలకృష్ణకు సంక్రాంతి హీరో అని పేరుంది. సమరసింహారెడ్డి,నరసింహనాయుడు, లక్ష్మీ నరసింహ వంటి అల్ టైం బ్లాక్ బస్టర్ మూవీస్ సంక్రాంతి కానుకగా విడుదలైనవే. అందుకే బాలకృష్ణ ప్రతి సంక్రాంతికి ఒక మూవీ విడుదలయ్యేలా ప్లాన్ చేస్తారు. అయితే ఈ సినిమాని మాత్రం సంక్రాంతికి రావడంలేదు. సాంప్రదాయానికి భిన్నంగా బాలయ్య ఈ చిత్రాన్ని సంక్రాంతికి ముందే విడుదల చేయనున్నారని అంటున్నారు. ఈ చిత్రాన్ని క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20న విడుదల చేయనున్నారని అంటున్నారు.

More Related Stories