English   

అల వైకుంఠపురములో పోస్టర్ విడుదల.. అదిరిపోయిన బన్నీ..

Ala Vaikunthapurramloo
2019-10-07 17:43:14

నా పేరు సూర్య తర్వాత అల్లు అర్జున్ ప్రస్తుతం నటిస్తున్న సినిమా అల వైకుంఠపురములో. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే షూటింగ్ కూడా సగానికి పైగా పూర్తయిపోయింది. తాజాగా విడుదలైన దసరా పోస్టర్ నెంబర్ వన్ ట్రెండింగ్ అవుతుంది. ఈ పోస్టర్ చూసి ఫ్యాన్స్ కూడా ఫిదా అయిపోతున్నారు.

ఓ గ్రౌండ్ లో విలన్స్ ను బాదుతూ ఉన్నపుడు తీసిన స్టిల్ ఇది. మాస్ కు కూడా ఈ చిత్రంలో కావాల్సినంత మసాలా ఉందని ఈ పోస్టర్ తో చూపించేసాడు దర్శకుడు త్రివిక్రమ్. ఇక ఈ మధ్యే విడుదలైన సామజవరగమన పాటకు కూడా అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో తమన్ ఈ స్థాయి మ్యూజిక్ అయితే ఈ సినిమాకు ఇవ్వలేదు. వినీ వినగానే  సూపర్ బ్లాక్ బస్టర్ అయిపోయింది ఈ ట్యూన్. ఇదిలా ఉంటే ఇప్పుడు విడుదలైన పోస్టర్ సినిమాపై అంచనాలు పెంచేసింది. విడుదలైన క్షణం నుంచి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది ఈ పోస్టర్. దాన్నిబట్టి బన్నీ రేంజ్ ఏంటనేది అర్థమవుతుంది.

ఆ మధ్య సినిమా టైటిల్ కూడా మార్చేసారు దర్శక నిర్మాతలు. పేరులో ఉన్న అక్షరాలను మార్చేసారు యూనిట్. పాత టైటిల్ కు r, o రెండు కొత్త అక్షరాలను జత చేశారు చిత్రయూనిట్. ఇది న్యూమరాలజీ ప్రకారంగా కూడా ఉండొచ్చు అంటున్నారు విశ్లేషకులు. సినిమా ఇండస్ట్రీలో సెంటిమెంట్ బలంగా నమ్ముతారు. అందుకే ఈ టైటిల్ లో మరో రెండు అక్షరాలు అదనంగా చేరాయి. సంక్రాంతికి ఈ సినిమా విడుదల కానుంది. రాధాకృష్ణ, అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. డీజే సినిమా తర్వాత పూజా హెగ్డే మరోసారి ఇందులో అల్లు అర్జున్ తో రొమాన్స్ చేస్తోంది.

More Related Stories