English   

స్టార్ మ్యుజీషియన్ గా మాధవన్...అయ్యే పనేనా

mad
2019-10-07 21:13:50

కన్నడ భామ అనుష్క, మాధవన్ ప్రధాన పాత్రలలో తెరకెక్కుతున్న చిత్రం నిశ్శబ్దం. అనుష్క మూగ యువతిగా,  పెయింటింగ్ ఆర్టిస్టుగా నటిస్తున్న ఈ సినిమా  నుండి మాధవన్ లుక్ రిలీజయింది. ఈ మేరకు చిత్ర యూనిట్ ఓ పోస్టర్ విడుదల చేయడం జరిగింది. వైలిన్ వాయిస్తున్నట్లు గా ఉన్న మాధవన్ ఫొటోతో పాటు ఆయన పాత్ర పేరు ఆంటోనీ అని ఆయన ఒక మ్యూజిక్ సెలెబ్రిటీ అని పేర్కొంది యూనిట్. అంజలి, షాలిని పాండే, సుబ్బరాజ్, శ్రీనివాస్ అవసరాల ఇతర కీలక పాత్రలు చేస్తున్న ఈ చిత్రంలో హాలీవుడ్ నటుడు మైకేల్ మాడిసన్ కూడా ఒక పాత్రలో నటిస్తున్నారు.

పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ మరియు కోన ఫిలిమ్స్ కార్పొరేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి హేమంత్ మధుకర్ దర్శకత్వం వహిస్తుండగా, గోపి సుందర్ సంగీతం అందిస్తున్నారు. అయితే ఈ సినిమా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉన్న సినిమా అని చెబుతున్నారు కానీ ఇప్పటికీ ఈ సినిమా మీద మన ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించడంలో విజయవంతం కాలేదనే చెప్పాలి. ఇప్పటికింకా ఈ సినిమా మీద బజ్ క్రియేట్ కాలేదు. బహుశా ఈ సినిమా టీజర్ రిలీజయ్యాక ఏమైనా పరిస్థితి మారుతుందేమో చూడాలి.

More Related Stories