English   

అల్లు అర్జున్ మాట నమ్మని చిరంజీవి..

chiru
2019-10-08 06:43:03

నిజమే.. ఇది చెప్పింది కూడా స్వయానా చిరంజీవే. ఆయన మాటను అస్సలు నమ్మలేదని.. బయటి వాళ్లు చెప్తే కానీ తనకు నమ్మకం రాలేదని చెప్పాడు మెగాస్టార్. ఏ విషయంలో చిరు ఇలా అనాల్సి వచ్చిందో కదా అంటూ ఆలోచిస్తున్నారా..? సైరా సినిమా విడుదల రోజు బయటి నుంచి ఫోన్స్ వస్తాయని ఎదురు చూస్తున్న తనకు.. ఉదయం 4 గంటల నుంచి ఒక్కరు కూడా కాల్ చేయలేదని.. దాంతో తనకు టెన్షన్ పెరిగిపోయిందని చెప్పాడు. తాము అనుకున్న కోణం ప్రేక్షకులకు రీచ్ కాలేదా.. నిజంగానే సినిమా ఏదైనా తేడా కొడుతుందా అనే భయం కూడా వేసిందని చెప్పాడు చిరు. తమకు సినిమాపై ఎంత నమ్మకం ఉన్నా కూడా ఒక్కరు కూడా ఫోన్ చేయకపోవడంతో నిజంగానే భయమేసిందని ఒప్పుకున్నాడు మెగాస్టార్. ఉదయం 2.30 నిమిషాలకు దేవీ శ్రీ ప్రసాద్ సూపర్బ్ అన్నయ్య అంటూ మెసేజ్ పెట్టినా కూడా సెకండాఫ్ చూసిన తర్వాత ఫోన్ చేయలేదని చెప్పాడు.

దానికితోడు తనకు రెగ్యులర్ గా కాల్ చేసే వాళ్లు కూడా చేయలేదని.. దాంతో భయపడిపోయానని చెప్పాడు చిరు. అలాంటి సమయంలో ఉదయం 7 గంటలకు బన్నీ వాయిస్ మెసేజ్ పెట్టాడని.. సినిమాకు ఎక్సలెంట్ అనే రిపోర్ట్స్ వస్తున్నట్లు చెప్పాడని తెలిపాడు మెగాస్టార్. కానీ ఇంటి సభ్యుడు కాబట్టి అలాగే చెప్తాడని బన్నీ మాటలను పట్టించుకోలేదని చెప్పాడు చిరు. ఆ తర్వాత బయటి నుంచి వచ్చిన కాల్స్ చూసి అప్పుడు నమ్మకం కుదిరిందని మనసులో మాట బయటపెట్టాడు మెగాస్టార్.

More Related Stories