English   

ఉయ్యాలవాడ ఫోటోపై సంచలన కమెంట్స్ చేసిన చిరంజీవి..

chiru
2019-10-08 07:35:04

సైరా నరసింహా రెడ్డి సినిమా చేయడానికి ఎలాంటి చరిత్ర లేదు.. ఖచ్చితత్వం కూడా లేదు.. చారిత్రాత్మక ఆధారాలు కూడా లభించలేదు.. కేవలం వాళ్లు వీళ్లు చెప్పినవి నమ్మి.. పుస్తకాల్లో ఉన్నవి చూసి ఈ సినిమా తెరకెక్కించాం అని చిత్రయూనిట్ ఒప్పుకున్నారు. ఇక ఈ చిత్రంలో చిరంజీవి తన పాత్రధారణ.. వేశధారణపై కూడా ఇప్పుడు కొన్ని కమెంట్స్ చేసాడు. అసలు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి అనే వ్యక్తి ఎలా ఉంటాడో ఎవరికీ తెలియదని చెప్పాడు చిరు. ఇప్పుడు మనకు గూగుల్ లో కనిపిస్తున్న రెండు మూడు ఫోటోలు కూడా ఉయ్యాలవాడ ఒరిజినల్ పిక్స్ కావంటూ సంచలనం సృష్టించాడు ఈయన.

ఈ విషయాన్ని కూడా స్వయంగా ఉయ్యాలవాడ కుటుంబ సభ్యులు తనను కలిసినపుడు చెప్పారని చెప్పాడు చిరంజీవి. అందులో ఉన్నది ఆయన మనవడు అని.. కాస్త పోలికలు కలవడంతో అప్పుడు ఆయనకు అలాంటి డ్రస్ వేయించి ఫోటో తీసారని చెప్పాడు మెగాస్టార్. ఈ విషయంపై తనకు కూడా క్లారిటీ లేదని.. కేవలం కుటుంబ సభ్యులు చెప్పింది మీకు పోస్ట్ చేస్తున్నానని తెలిపాడు చిరంజీవి. ఇదిలా ఉంటే తన గెటప్ కోసం తానే కష్టపడ్డానని.. అప్పట్లో ఎలా ఉండేవాళ్లో కాస్త సమాచారం సేకరించి గెటప్ కోసం పూర్తిగా తనను తాను సన్నద్ధం చేసుకున్నానని చెప్పాడు మెగాస్టార్. మొత్తానికి ఇన్ని రోజులు ఉయ్యాలవాడ ఫోటో ఇదే అంటూ వస్తున్నది కూడా అబద్ధమే అని చిరంజీవే చెప్పేసరికి షాక్ అవ్వడం ప్రేక్షకుల వంతయింది.

More Related Stories