English   

మెగాస్టార్ కి స్పెషల్ గిఫ్ట్ రెడీ చేసిన చరణ్ 

 Ram Charan
2019-10-08 13:49:59

మెగాస్టార్ అమితాబ్ ని చరణ్ సర్ ప్రైజ్ చేయబోతున్నాడనే ప్రచారం మొదలయ్యింది. సైరా-నరసింహారెడ్డి చిత్రంలోనూ అమితాబ్ బచ్చన్ గోసాయి వెంకన్నగా చిరంజీవి గురువు పాత్రలో నటించాడు. ఈ సినిమాకి అది ముఖ్యమైన పాత్ర కావడంతో ఏరికోరి చిరంజీవే బిగ్ బీ కావాలని అడిగి మరీ చేయించుకున్నాడు. చిరంజీవి ఓ మాట అడగ్గానే మరో ఆలోచన లేకుండా సైరాలో నటిస్తున్నట్టు అమితాబ్ మాట ఇచ్చారు. అంతేకాదు రెమ్యూనరేషన్ తీసుకోకపోవడంతో పాటు షూటింగ్ జరిగినన్ని రోజులు సొంత ఖర్చుల మీద అమితాబ్ ముంబై నుండి వచ్చి వెళ్లాడట. ఆయన స్నేహాన్ని వెలకట్టలేమని చెప్పిన చిరు ఇప్పుడు స్పెషల్ కారుని గిప్ట్ గా ఇవ్వబోతున్నాడనే ప్రచారం జరుగుతోంది.

అమితాబ్ కి కార్లు అంటే ఎంతో ఇష్టం అనే విషయం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే అమితాబ్ బచ్చన్ కి సైరా నిర్మాత రామ్ చరణ్  కాస్ట్ లీ కార్ గిప్ట్ గా రెడీ చేశాడని అంటున్నారు. తన తండ్రి స్నేహం కోసం వితౌట్ రెమ్యూనరేషన్ సైరాలో నటించినందుకుగాను మెగా ఫ్యామిలీ అమితాబ్ కి అరుదైన బాహుమతి సిద్దం చేసినట్టు సమాచారం.  రోల్స్ రాయిస్ ఫాంటమ్ లగ్జరీ కార్ ని కానుకగా ఇచ్చేందుకు రామ్ చరణ్ ప్లాన్ చేశాడని అంటున్నారు. కార్ అంటే ముచ్చట పడిపోయే అమితాబ్ గ్యారేజీలో ఇప్పటికే బోలెడన్ని ఖరీదైన కార్లు ఉన్నాయి. వాటిలో చరణ్ ఇచ్చే కార్ చాలా స్పెషల్ గా మెరవనుందని తెలుస్తోంది. ఈ కారు ఖరీదు ఆన్ రోడ్  6 కోట్ల విలువ ఉందట. చూడాలి మరి ఆ కార్ ఎప్పటికి అమితాబ్ గ్యారేజ్ కి చేరనుందో ?

More Related Stories