English   

అర్జున్ సురవరంకి రిలీజ్ డేట్ దొరికింది

 arjun suravaram
2019-10-08 14:07:33

యంగ్ హీరో నిఖిల్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘అర్జున్‌ సురవరం’. లావణ్య త్రిపాఠి కథానాయికగా నటించిన ఈ సినిమా టి.సంతోష్‌ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే నిజానికి నిఖిల్ కి ఎక్కడికి పోతావు చిన్నవాడా తర్వాత సరైన హిట్ అనేదే లేదు. ఈసారి ఎలా అయినా హిట్ కొట్టాలని టైం తీసుకొని మరీ ముద్ర అనే సినిమా చేశాడు. ఫస్ట్ లుక్, టైటిల్ లోగో ఒక టీజర్ కూడా రిలీజ్ చేసిన ఈ సినిమాకి సినిమా కష్టాలు మొదలయ్యాయి. నిఖిల్ జర్నలిస్ట్ గా నటించిన ఈ సినిమా పేరు ముందు ముద్ర అనుకున్నా ఆ తర్వాత టైటిల్ కి సంబందించిన వివాదాలు ఎదురయ్యాయి, దాంతో ముద్ర కాస్త అర్జున్ సురవరంగా మారింది. 

 అయితే నిజానికి ముందుగా చెప్పిన టైం ప్రకారం అయితే అర్జున్ సురవరం సినిమా ఎప్పుడో రిలీజ్ కావాలి కానీ అది గత ఆరు నెలలుగా వాయిదా పడుతూ ఎప్పుడు ప్రేక్షకుల ముందుకి వస్తోందో తెలియని పరిస్థితి ఏర్పడింది. అందుతున్న తాజా సమాచారం ప్రకారం  ఈ సినిమా నవంబర్ 8న ప్రేక్షకుల ముందుకు రానుందట. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రానుందని అంటున్నారు. లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని సంతోష్ తెరకెక్కించాడు. ప్రస్తుతం నిఖిల్ తన కెరీర్ లో సూపర్ హిట్ గా నిలిచిన కార్తికేయ చిత్రానికి సీక్వెల్ గా తెరకెక్కనున్న కార్తికేయ 2 ను మొదలుపెట్టేందుకు సిద్ధమవుతున్నాడు. చందూ మొండేటి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ నవంబర్ రెండో వారం నుండి మొదలెట్టనున్నారని అంటున్నారు.  
 

More Related Stories