వెంకీ మామ టీజర్...జై కిసాన్ జై జవాన్

దగ్గుబాటి, అక్కినేని కుటుంబాల రెండు తరాల హీరోలు, మామ అల్లుళ్లయిన వెంకటేష్-నాగ చైతన్య కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ సినిమా వెంకీ మామ. రాశి ఖన్నా, పాయల్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాని బాబీ డైరెక్ట్ చేస్తున్నాడు. ఇప్పటి వరకూ ఈ సినిమా నుంచి వచ్చిన ప్రతి పోస్టర్ ఆకట్టుకుంది. ఇప్పుడు ప్రొమోషన్స్ స్పీడ్ పెంచిన చిత్ర యూనిట్, దసరా కానుకగా వెంకీ మామ ఫస్ట్ లుక్ గ్లిప్జ్ రిలీజ్ చేశారు. 38 సెకన్ల నిడివి గల ఈ టీజర్ లో సినిమాలో మామా అల్లుళ్ళ పాత్రలు ఏమిటో చెప్పే ప్రయత్నం చేశారు. జై జవాన్ – జై కిసాన్’ అనే స్లోగన్ నుంచి టీజర్ కట్ చేశారు. అంటే వెంకీ రైతుగా, చైతన్య సైనికుడిగా కనిపించబోతున్నారన్నమాట.
“గోదావరిలో ఈత నేర్పా.. బరిలో ఆట నేర్పా .. ఇప్పుడు జాతరలో వేట నేర్పిస్తా.. రారా అల్లుడు..” “ఏమంటుందిరా ఇందాకట్నుంచి ప్రాక్టీస్ చేస్తుంటే ఐ లవ్ యు ఐ లవ్ యూ… ఐ లవ్ యు.. ఐ లవ్ యూ అనేసిందిరా అల్లుడూ..” అనే డైలాగ్స్ వెంకటేష్ తోనే చెప్పించి టీజర్ లో ఫన్ తో పాటు యాక్షన్ కూడా ఉందనే హింట్ ఇచ్చారు.ఈ మూవీలో హీరోయిన్స్ గా రాశి ఖన్నా, పాయల్ రాజ్ పుత్ నటిస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్ మరియు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఎస్ ఎస్ థమన్ సంగీతం అందించిన ఈ మూవీ ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉంది. ఇక ఈ సినిమాని దీపావళికి లేదా డిసెంబర్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.