English   

వినాయక్ హీరోగా సినిమా మొదలు.. భారీగా ఏర్పాట్లు..

 Vinayak
2019-10-08 17:24:16

తెలుగు ఇండస్ట్రీలో ఒకప్పుడు రాజమౌళి తర్వాత ఆ స్థాయి మాస్ ఇమేజ్ ఉన్న దర్శకుడు వివి వినాయక్. ఈయన పేరు చెబితే చాలా బ్లాక్ బస్టర్ సినిమాలు గుర్తుకు వస్తాయి. కానీ కొన్ని రోజులుగా మనోడి టైమ్ అస్సలు బాలేదు. ఆయనతో సినిమాలు చేయడానికి ఇప్పుడు స్టార్ హీరోలు కూడా ఆసక్తి చూపించడం లేదు. ఇక చిన్న హీరోలు సైతం వినాయక్ అంటే ఎందుకు రిస్క్ అనుకుంటున్నారు. సాయి ధరమ్ తేజ్ తో తెరకెక్కించిన ఇంటెలిజెంట్ సినిమా డిజాస్టర్ కావడంతో వినాయక్ పై పూర్తిగా నెగిటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చేసింది. ఆ సినిమా వచ్చి రెండేళ్లు దాటిపోయిన కూడా ఇప్పటివరకు వినాయక్ మరో సినిమా మొదలు పెట్టలేదు. బాలకృష్ణతో సినిమా ఓకే అయినా ఆయన మాత్రం పట్టించుకోనట్లు ఉన్నాడు. దాంతో ప్రస్తుతం దర్శకుడి నుంచి నటుడిగా మారిపోయాడు ఈ దర్శకుడు. శ్రీనివాసరావు దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాతగా ఒక సినిమా చేస్తున్నాడు వినాయక్. ఈ సినిమా కోసమే ఇప్పుడు లుక్ కూడా మార్చేసాడు ఈయన. ఇప్పుడు విడుదలైన వినాయక్ స్టిల్స్ చూసి అంతా షాక్ అవుతున్నారు. అంతగా మారిపోయాడు వినయ్. ఈ సినిమా ఓపెనింగ్ అక్టోబర్ 9న అన్నపూర్ణ స్టూడియో ఉదయం 7.15 నిమిషాలకు జరగనుంది. దీనికి ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులు హాజరు కానున్నారు. దర్శకుడిగా సంచలనాలు చేసిన ఈయన ఇప్పుడు హీరోగా కూడా రప్ఫాడిస్తారని నమ్ముతున్నారు అభిమానులు. మరి వినాయక్ నటుడిగా ఎలాంటి రచ్చ చేస్తాడో చూడాలిక.

More Related Stories