తెలుగు లస్ట్ స్టోరీస్ లో బోల్డ్ బ్యూటీ...ఏమి చేస్తారో

విక్కీ కౌశల్, కియారా అద్వానీ, మనీషా కోయిరాలా, భూమి ఫడ్నేకర్, సంజయ్ కపూర్, రాధికా ఆప్టే లాంటి నటీనటులు నటించిన ‘లస్ట్ స్టోరీస్’ తొలి భాగం గత ఏడాది జూన్ 15న ప్రారంభమై బాలీవుడ్లో సంచలనాలు సృష్టించింది. బాలీవుడ్ ‘లస్ట్ స్టోరీస్’ ని నిర్మించిన ఆర్ఎస్వీపీ ప్రొడక్షన్ హౌస్ తెలుగులోనూ ఈ సిరీస్ నిర్మించనుంది. నాలుగు భాగాలుగా తెరకెక్కనున్న ఈ వెబ్ సిరీస్ ను నాలుగు భాగాలలో చెరో భాగాన్ని నందిని రెడ్డి, తరుణ్ భాస్కర్, సంకల్ప్ రెడ్డి, సందీప్ రెడ్డి తెరకెక్కిస్తారు. రోనీ స్క్రవాలా ఈ ఒరిజినల్ ను నిర్మిస్తారు.
నందిని రెడ్డి తెరకెక్కించే సెగ్మెంట్ లో బోల్డ్ బ్యూటీ అమలా పాల్ నటిస్తుందని అంటున్నారు. హిందీ వెర్షన్ లో కియారా అద్వానీ అత్యంత బోల్డ్ గా నటించిన ఈ రోల్ లో అమలాపాల్ నటించనుందని అంటున్నారు. నిజానికి కియారా అద్వానీ ఈ రోల్ లో నటించే అందరి దృష్టిలో పడింది. ఈ సిరీస్ లో స్వయంతృప్తి పొందే ఒక సీన్ పై జనాల్లో విపరీతమైన చర్చ కూడా జరిగింది. మరి తెలుగు వెర్షన్ లో కూడా ఆ బోల్డ్ నెస్ ను అలాగే ఉంచుతారా లేక మనవాళ్ళు అంత ఘాటు తట్టుకోలేరు కాబట్టి కొంచెం తగ్గిస్తారా అనేది చూడాలి. బాలీవుడ్ నే ఒక ఊపు ఊపేసిన ఈ ‘లస్ట్ స్టోరీస్’ తెలుగులో ఎన్ని సంచలనాలు సృష్టిస్తుందే వేచి చూడాలి.