English   

సైరా ఫస్ట్ వీక్ కలెక్షన్స్.. చిరంజీవి నాన్ బాహుబలి రికార్డ్..

Sye Raa collections.jpg
2019-10-09 10:43:28

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన సైరా నరసింహారెడ్డి సినిమా వసూళ్ల వర్షం కురిపిస్తుంది. కానీ తెలుగులో మాత్రమే. ఈ సినిమా అంచనాలకు తగ్గట్లుగానే తెలుగులో పర్ఫార్మ్ చేస్తుంది. కానీ మిగిలిన చోట్ల మాత్రం చతికిలపడింది. అక్కడ ఈ చిత్రం పైకి లేచేలా కూడా కనిపించడం లేదు. ప్రపంచ వ్యాప్తంగా సైరా 7 రోజుల్లో దాదాపు 110 కోట్ల షేర్ వసూలు చేసింది. రెండు భాషల్లో మాత్రమే సత్తా చూపిస్తుంది ఈ చిత్రం. తెలుగుతో పాటు కన్నడలో కూడా అదరగొడుతుంది సైరా. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు 7 రోజుల్లో 82 కోట్లకి పైగా షేర్ వసూలు చేసింది. 108 కోట్లతో ఈ చిత్రం బరిలోకి దిగింది.

ప్రస్తుతం దసరా సెలవులు కావడంతో కచ్చితంగా ఈ మార్క్ అందుకునేలా కనిపిస్తుంది సైరా. పైగా ఇంకా మూడు రోజులు సెలవులు ఉండటంతో ధైర్యంగానే కనిపిస్తున్నారు బయ్యర్లు. కానీ మిగిలిన చోట్ల మాత్రం పరిస్థితి మరోలా ఉంది. హిందీలో కనీసం పట్టించుకోవడం లేదు ఈ చిత్రాన్ని. సైరా నరసింహారెడ్డికి అక్కడ ఊహించిన బ్రేక్ వేసింది వార్. హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ జోరు ముందు చిరు నిలబడలేకపోతున్నాడు. 7 రోజుల్లో ఇప్పటి వరకు హిందీలో కేవలం 16 కోట్లు మాత్రమే వసూలు చేసింది ఈ చిత్రం.

తెలుగు వెర్షన్ మాత్రమే చిరంజీవి ఇమేజ్ తో సంచలన వసూళ్లు తీసుకొస్తుంది. తమిళంలో కూడా విజయ్ సేతుపతి, నయనతార ఉన్నా ప్రయోజనం కనిపించడం లేదు. దాంతో దర్శక నిర్మాతలు కంగారు పడుతున్నారు. ఇప్పటికీ 70 కోట్లు వెనుకబడి ఉన్నాడు మెగాస్టార్. సైరా చివరివరకు ఏం చేస్తుందనేది చూడాలిక. 

More Related Stories