English   

వినాయక్ నటుడిగా ఎంతవరకు సక్సెస్ అవుతాడు..?

VVVinayak.jpg
2019-10-09 11:09:34

దర్శకుడిగా వినాయక్ కు తిరుగులేదు. కొన్నేళ్ల పాటు పీక్స్ చూసాడు. ఆయన కోసం స్టార్ హీరోలు కూడా వేచి చూసారు. కానీ ఇప్పుడు ఆయన దర్శకుడిగా ఫెయిల్యూర్స్ లో ఉన్నాడు. సాయి ధరమ్ తేజ్ ఇంటిలిజెంట్ సినిమా తర్వాత ఇప్పటి వరకు మళ్లీ మెగాఫోన్ పట్టలేదు. కనీసం ఆయనకు అవకాశాలు కూడా ఎవరూ ఇవ్వడం లేదు. ఇలాంటి సమయంలో నటుడిగా మారిపోయాడు వినాయక్. దానికోసమే గెటప్ కూడా మార్చేసాడు. బాడీ బిల్డప్ చేసాడు. అన్నీ బాగానే ఉన్నాయి కానీ నటుడిగా ఈయన ఎంతవరకు సక్సెస్ అవుతాడనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అసలు వినాయక్ హీరో అవుతాడని ఎవరూ అనుకోలేదు. ఉన్నట్లుండి యాక్టర్ అయిపోయాడు ఈయన. ఇప్పుడు వినాయక్ గెటప్ చూస్తుంటేనే వారెవా అనిపిస్తుంది. అంతగా మేకోవర్ అయిపోయాడు. ఈయన సినిమాకు సీనయ్య అనే పేరు కూడా పెట్టాడు. దిల్ రాజు నిర్మాత కావడంతో అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి.

గతంలో ఠాగూర్ సినిమాలో చిన్న పాత్రలో నటించాడు వినాయక్. అప్పుడే ఆయనలో మంచి ఈజ్ కనిపించింది. ఆ తర్వాత అదుర్స్, ఖైదీ నెం 150 లాంటి సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో కనిపించాడు. ఇప్పుడు హీరో అవుతున్నాడు. కచ్చితంగా వినాయక్ స్క్రీన్ పై బాగుంటాడని తెలుసు.. కానీ అది ఎంతవరకు సక్సెస్ అవుతుందనేది చూడాలి. గతంలోనూ కొందరు దర్శకులు ఇలాగే నటులుగా మారి.. ఆ తర్వాత పూర్తిగా ఫేడవుట్ అయిపోయారు. మరి ఇప్పుడు వినాయక్ ఏం చేస్తాడో..? 

More Related Stories