English   

చిరంజీవి, బాలయ్య మధ్య ఇంకా దూరం తగ్గలేదా..

Balakrishna
2019-10-09 16:16:44

తెలుగు ఇండస్ట్రీలో చిరంజీవి తర్వాత మరో హీరో పేరు చెప్పమంటే ఆలోచించకుండా బాలకృష్ణ పేరే చెప్తారు. పైగా ఈ ఇద్దరు హీరోలు టాలీవుడ్ కు పెద్దదిక్కు కూడా. ఇక ఇండస్ట్రీలో ఏ సీనియర్ హీరో అయినా మంచి సినిమా చేస్తే కచ్చితంగా ఇతర హీరోలు కూడా వాళ్లను ప్రశంసిస్తుంటారు. ఇప్పుడు కాదు.. ఎప్పట్నుంచో వస్తున్న ఆనవాయితీ ఇది. ఇప్పుడు కూడా సైరా సినిమా చూసి చిరంజీవిని ప్రశంసల్లో ముంచెత్తారు వెంకటేష్, నాగార్జున. కానీ బాలయ్య మాత్రం ఇప్పటి వరకు చిరును కలవలేదు.. సైరా గురించి మాట్లాడలేదు. తెలుగు ఇండస్ట్రీ అంతా కలిసి మాట్లాడుకుంటున్న సినిమా గురించి నందమూరి కుటుంబం నోరు మెదపకుండా ఉండటంపై అభిమానుల్లో లేనిపోని అనుమానాలు వస్తున్నాయి. ఇంతకు ముందు కూడా తనకు చిరు ఒక్కడే బెస్ట్ ఫ్రెండ్ అంటూ చెప్పాడు బాలయ్య. కానీ బయటికి ఎంత చెప్పుకున్నా.. లోపల మాత్రం ఈ ఇద్దరు హీరోల మధ్య ఏదో తెలియని గ్యాప్ ఉందని అర్థమవుతుంది. ఇప్పుడు సైరా విషయంలో మరోసారి అది రుజువైంది. ఇండస్ట్రీ అంతా ఏకమై చిరంజీవిని పొగుడుతుంటే బాలయ్య మాత్రం ఇప్పటి వరకు కనీసం పట్టించుకోలేదు. పైగా ఎన్టీఆర్ కూడా ఈ సినిమా గురించి ఎక్కడా కామెంట్ చేయలేదు. మొత్తానికి ఇదంతా చూస్తుంటే బాలయ్య, చిరంజీవి మధ్య ఇంకా దూరం అలాగే ఉండిపోయిందని అర్థమవుతుంది. మరి ఇది ఎప్పుడు తొలిగిపోతుందో చూడాలి.

More Related Stories