English   

బాలయ్యకు పోటీగా వెళ్తున్న మాస్ రాజా.. రవితేజతో మళ్లీ వార్..

Balakrishna Raviteja
2019-10-09 16:44:03

తెలుగు ఇండస్ట్రీలో కొన్ని బాక్సాఫీస్ వార్స్ ఆసక్తికరంగా ఉంటాయి. అలాంటి ఓ యుద్ధమే రవితేజ, బాలయ్య మధ్య జరుగుతుంది. అదేం విచిత్రమో కానీ ఈ ఇద్దరూ బాక్సాఫీస్ దగ్గర భలే పోటీ పడుతుంటారు. ఇప్పుడు ఈయన నటిస్తున్న కేయస్ రవికుమార్ సినిమా డిసెంబర్ 20న విడుదలవుతుందని తెలుస్తుంది. ఇదే విషయాన్ని నిర్మాత సి కళ్యాణ్ కూడా ప్రకటించాడు. క్రిస్మస్ హాలీడేస్ ఉంటాయి కాబట్టి దాన్ని క్యాష్ చేసుకోడానికి ముందుకొస్తున్నాడు బాలయ్య. ఇక అదే సీజన్ లో రవితేజ కూడా వస్తున్నాడు. ఈయన నటిస్తున్న డిస్కో రాజా సినిమా కూడా డిసెంబర్ 20నే విడుదల కానుంది. చాలా రోజుల కిందే ఈ డేట్ లాక్ చేసుకున్నారు దర్శక నిర్మాతలు. కానీ ఇప్పుడు ఇదే తేదీ రోజు బాలయ్య కూడా వస్తున్నాడు. దాంతో డిస్కో రాజా నిర్మాతలకు ఏం చేయాలో అర్థం కావడం లేదు. బాలయ్యతో రవితేజది భలే తమాషా కాంబినేషన్. ఈ ఇద్దరూ గతంలో రెండుసార్లు సంక్రాంతికి పోటీ పడ్డారు. 2008 సంక్రాంతికి ఒక్క మగాడుగా బాలయ్య వస్తే.. కృష్ణ అంటూ వచ్చి బ్లాక్ బస్టర్ కొట్టాడు రవితేజ. ఆ తర్వాత 2011లో పరమవీరచక్రతో బాలయ్య పోరు చేస్తే మిరపకాయ్ ఘాటు చూపించాడు మాస్ రాజా. ఈ రెండు సార్లు కూడా రవితేజనే విజయం సాధించాడు. ఇప్పుడు ఆ కసి బాలయ్యలో ఉంది. మరి మూడోసారి ఎలాంటి ఫలితం రాబోతుందో అని వేచి చూస్తున్నారు అభిమానులు.

More Related Stories