English   

ఫ్యూచర్‌లో థియేటర్స్ పరిస్థితేంటి.. ముందుంది ముసళ్లపండగ..

movie
2019-10-09 18:52:18

ఇప్పుడు థియేటర్స్ కు వచ్చిన ఇబ్బందేంటి అనుకుంటున్నారా..? ఒకప్పుడు థియేటర్స్ అంటే చాలా ఇమేజ్ ఉండేది. కానీ రానురాను అది పడిపోతుంది. ముఖ్యంగా ఇప్పుడు థియేటర్స్ కంటే కూడా కళ్యాణ మంటపాలు ఎక్కువైపోతున్నాయి. చాలా ఊళ్లలో థియేటర్స్ ను మార్చేసి పెళ్లి మంటపాలుగా మార్చేస్తున్నారు. ఎందుకంటే మల్టీప్లెక్సుల గోలలో పడి ఇప్పుడు సింగిల్ స్క్రీన్స్ ను పట్టించుకునే నాథుడే లేడు. పైగా ఒకప్పట్లా ఇప్పుడు పెద్ద సినిమా విడుదలైతే పండగలు చేసుకోవడం అభిమానులు కూడా మానేసారు. పండగల సమయంలో పెద్ద సినిమాలు వస్తే ఇంక పండగే నిర్మాతలకు. అందుకే వాళ్ల సినిమాలు అప్పుడు విడుదలయ్యేవి. కానీ ఇప్పుడు అలా జరగడం లేదు. ఒకప్పుడు కుటుంబాలన్నీ కలిసి థియేటర్స్ వైపు వచ్చి పండగ చేసుకునేవాళ్లు. మన తెలుగు లోగిళ్లలో సినిమా కూడా పండగే. కానీ ఇప్పుడు అలా కనిపించడం లేదు.

ఇప్పుడు వెబ్ సిరీస్ లు.. నెట్ ఫ్లిక్స్.. అమేజాన్ ఎక్కువైపోయేసరికి బ్లాక్ బస్టర్ సినిమాలు కూడా నెల రోజుల్లోనే వచ్చేస్తున్నాయి. దాంతో థియేటర్స్ కు రావడం మానేసారు మన ఆడియన్స్. ఇప్పుడు సైరా లాంటి సినిమాకు కూడా మూడు రోజుల తర్వాత కలెక్ణ్లు రావడం లేదు. నేటితరం పూర్తిగా స్మార్ట్ ఫోన్ - ల్యాప్ టాప్ లలో సినిమాలు చూస్తుంటే ఇక థియేటర్స్ కు ఎందుకొస్తారు చెప్పండి..? వందల కోట్లు పెట్టి సినిమా తీస్తుంటే జనాలు మాత్రం టీవీలకు అతుక్కుపోవడం నిర్మాతలకు భయం తెప్పిస్తుంది. పరిస్థితి ఇలాగే ఉంటే రాబోయే రోజుల్లో అసలు థియేటర్స్ నడపటం కూడా కష్టంగా మారుతుంది. మరి చూడాలిక.. ఈ పరిస్థితి నుంచి బయటపడాలంటే ఇంకేం చేయాలో..?

More Related Stories