English   

సైరా కలెక్షన్స్.. చిరంజీవికి ముందుంది ముసళ్ల పండగ.. 

  Sye Raa Narasimha Reddy
2019-10-10 14:35:49

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన సైరా నరసింహారెడ్డి అప్పుడే వారం రోజులు పూర్తి చేసుకుంది. ఈ సినిమా తొలి వారం వసూళ్ల వర్షం కురిపించింది.. కానీ తెలుగులో మాత్రమే. మన దగ్గర అంచనాలకు తగ్గట్లుగానే ఈ సినిమా పర్ఫార్మ్ చేస్తుంది. కానీ మిగిలిన చోట్ల మాత్రం చతికిలపడింది. అక్కడ పైకి లేచేలా కూడా కనిపించడం లేదు సైరా. ప్రపంచ వ్యాప్తంగా సైరా 7 రోజుల్లో దాదాపు 115 కోట్ల షేర్ వసూలు చేసింది. ప్రభాస్ సినిమాల తర్వాత తెలుగులో ఫస్ట్ వీక్ కలెక్షన్స్ రికార్డ్ ఇదే. తెలుగుతో పాటు కన్నడలో కూడా అదరగొడుతుంది సైరా. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు 7 రోజుల్లో 83 కోట్లకి పైగా షేర్ వసూలు చేసింది. మరో 25 కోట్లు వెనక బడే ఉంది సైరా. దసరా సెలవులు మరో మూడు రోజులు మాత్రమే ఉండటంతో అసలు పరిస్థితి ముందుంది. మిగిలిన చోట్ల మాత్రం పరిస్థితి మరీ దారుణంగా ఉ:ది. 7 రోజుల్లో ఇప్పటి వరకు హిందీలో కేవలం 5 కోట్లు షేర్ మాత్రమే వసూలు చేసింది ఈ చిత్రం. ఎటు చూసుకున్నా కూడా తెలుగులో కాకుండా అన్ని భాషల్లోనూ చిరంజీవి సైరా నరసింహా రెడ్డి ఫ్లాప్ అని తేల్చేస్తున్నారు విశ్లేషకులు. నమ్మడానికి ఇది కష్టంగా అనిపించినా కూడా ఇదే నిజం. 
 

More Related Stories