English   

బాక్సింగ్ గ్లౌజులతో వరుణ్ తేజ్.. కొత్త సినిమా కోసం పాట్లు.. 

Varun Tej
2019-10-10 16:19:05

ఎఫ్2, గద్దలకొండ గణేష్ సినిమాలతో వరస విజయాలు అందుకుంటున్నాడు వరుణ్ తేజ్. వాల్మీకి విడుదలైన నెల రోజుల్లోపే మరో సినిమాపై కూడా క్లారిటీ ఇచ్చేసాడు ఈయన. వరుణ్ తేజ్ 10 అంటూ పోస్టర్ కూడా విడుదల చేసారు దర్శక నిర్మాతలు. ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పిస్తుండటం విశేషం. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కబోయే ఈ చిత్రం కోసమే ఆ మధ్య అమెరికా వెళ్లొచ్చాడు వరుణ్. అక్కడే కొన్ని రోజులు ఉండి బాక్సింగ్ లో కోచింగ్ తీసుకుని వచ్చాడు. దీనికంటే ముందు అంతరిక్షం కోసం కజకిస్తాన్ వెళ్లి శిక్షణ తీసుకున్న వరుణ్.. ఇప్పుడు అమెరికా వెళ్లొచ్చాడు. సిద్దు మద్దు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా అల్లు అరవింద్ పెద్ద కొడుకు వెంకటేష్ నిర్మిస్తున్నాడు. కిరణ్ కొర్రపాటి సహ నిర్మాత. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. త్వరలోనే షూటింగ్ మొదలు కానుంది. కచ్చితంగా ఈ చిత్రంతో వరుణ్ తేజ్ మరో బ్లాక్ బస్టర్ అందుకోవడం ఖాయం అంటున్నారు దర్శక నిర్మాతలు. మరి చూడాలిక.. వాళ్ల నమ్మకాన్ని వరుణ్ ఎంతవరకు నిలబెడతాడో.. బాక్సింగ్ గ్లౌజులు వేసుకుని ఎంత రచ్చ చేస్తాడో..? 
 

More Related Stories