English   

ఆవిరి ట్రైలర్.. రవిబాబు ఈజ్ బ్యాక్ విత్ ఘోస్ట్..

 Ravi Babu
2019-10-10 18:03:58

రవిబాబు సినిమాలంటేనే ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన సినిమాలన్నీ చాలా విభిన్నంగా ఉంటాయి. రొటీన్ సినిమాలకు చాలా దూరంగా తన సినిమాలను తెరకెక్కిస్తుంటాడు ఈ దర్శకుడు. ఇప్పుడు కూడా నిర్మాత దిల్‌రాజు స‌మ‌ర్ప‌ణ‌లో ఏ ఫ్ల‌యింగ్ ఫ్రాగ్స్ ప్రొడ‌క్ష‌న్ బ్యాన‌ర్‌పై ర‌విబాబు దర్శ‌క నిర్మాణంలో రూపొందిన చిత్రం ఆవిరి. ఈ సినిమా నవంబర్ 1న విడుద‌ల‌ కానుంది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ విడుదలైంది. మరోసారి దెయ్యాన్ని వెంటపెట్టుకుని వస్తున్నాడు ఈ దర్శకుడు.

ఇందులో ఆయనే హీరోగా కూడా నటించాడు. మరోసారి కథనే ప్రధానంగా సాగే థ్రిల్లర్ సబ్జెక్టుతో వస్తున్నాడు రవిబాబు. ట్రైలర్ నిండా దెయ్యాలు, ఆత్మలు చూపించాడు రవిబాబు. మున్నీ అనే పాప చుట్టూనే ఈ కథ అంతా తిరుగుతుంది. ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌క నిర్మాత ర‌విబాబు మాట్లాడుతూ ఈ సినిమా ట్రైలర్ కు ప్రేక్ష‌కుల నుండి చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. దీంతో సినిమాపై అంద‌రిలో ఆస‌క్తి నెల‌కొంది. అన్నీ కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకున్న మా  చిత్రాన్ని నవంబర్ 1న ప్రేక్షకుల ముంద‌కు తీసుకువ‌స్తున్నామని చెప్పాడు. ఈ సినిమా త‌ప్ప‌కుండా ప్రేక్ష‌కుల‌ను మెప్పించేలా,థ్రిల్లింగ్‌గా, ఎంగేజింగ్‌గా ఉంటుందని చెప్పాడాయన. ట్రైలర్ చూస్తుంటే మరోసారి రొటీన్ ఆత్మకథతోనే వస్తున్నాడు రవిబాబు. దిల్ రాజు ఈ చిత్రానికి సమర్పకుడు. రవిబాబు ఎప్పుడు ఏ కథ రాస్తాడో చెప్పడం కష్టమే. మరి ఈ ఆవిరి ఆయన కెరీర్ కు ఊపిరి పోస్తుందో లేదో చూడాలి.

More Related Stories