English   

చిరంజీవి, జగన్ ప్రత్యేక భేటీ.. లంచ్‌కు కలవనున్న ముఖ్యమంత్రి..

chiru
2019-10-11 05:09:24

తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు చిరంజీవి చాలా బిజీ అయిపోయాడు. ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు రాజకీయ నాయకులతో కూడా సన్నిహిత సంబంధాలు మెయింటేన్ చేస్తున్నాడు. ఇప్పటికే తెలంగాణలో కేటీఆర్ సహా ఇక్కడ చాలా మందితో చిరుకు మంచి స్నేహం ఉంది. ఇప్పుడు ఆంద్రాలో కూడా ఇదే కంటిన్యూ చేస్తున్నాడు. ప్రస్తుతం అక్కడ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో తన పరిచయాన్ని మరింత పెంచుకుంటున్నాడు ఈయన. జగన్ తో భేటీ కోసం చిరంజీవి ప్రయత్నిస్తున్నాడు. ముందు అక్టోబర్ 11న ఈయనకు అప్పాయిట్మెంట్ దొరికిందనే వార్తలు వచ్చినా కూడా ఇప్పుడు అది అబద్ధమని తేలిపోయింది.

అక్టోబర్ 14 మధ్యాహ్నం లంచ్ బ్రేక్ కు చిరంజీవికి జగన్ అప్పాయిట్మెంట్ ఇచ్చాడని ప్రచారం జరుగుతుంది. ఇదేం ప్రత్యేకమైన రాజకీయ భేటీ కాదని.. కేవలం సైరా సినిమాను చూడ్డానికి జగన్ ను ఆహ్వానించడానికే చిరు వస్తున్నాడని సన్నిహిత వర్గాలు తెలియజేస్తున్నాయి. ఇప్పటికే తను నటించిన ఈ చిత్రాన్ని అందరికీ చూపిస్తున్నాడు మెగాస్టార్. ఇదే క్రమంలో ఏపీ ముఖ్యమంత్రిని కూడా ఆహ్వానించడానికి చిరు రెడీ అయ్యాడు. సైరా ఇప్పటికే వారం రోజుల్లో 120 కోట్లు వసూలు చేసింది. తెలుగులో ఈ చిత్రం సంచలన విజయం సాధించడానికి దూసుకెళ్తుంది. కానీ ఇతర భాషల్లో మాత్రం సైరాకు తిప్పలు తప్పడం లేదు.

More Related Stories