రామ్ చరణ్‌పై అంత ఈర్ష్య ఎందుకు అల్లు అరవింద్ గారూ..

మేనల్లుడిపై అల్లు అరవింద్ కు ఎందుకు ఈర్ష్య ఉంటుంది.. మరీ విడ్డూరం కాకపోతేనూ అనుకుంటున్నారా..? ఉంటుంది కచ్చితంగా ఉంటుంది.. ఎందుకు ఉండకూడదు అంటున్నాడు మెగా నిర్మాత. ఇప్పుడు నిజంగానే తన మేనల్లుడిని చూస్తుంటే తనకు చాలా ఈర్ష్యగా ఉందంటున్నాడు అల్లు అరవింద్. దానికి కారణం కూడా లేకపోలేదు. సైరా సినిమాను తాను నిర్మించలేకపోయానే అనే బాధ అరవింద్ లో కనిపిస్తుంది. ఈ చిత్రం విజయం సాధించినందుకు కళాబంధు సుబ్బిరామిరెడ్డి పార్క్ హయత్‌లో చిత్రయూనిట్‌కు పెద్ద పార్టీ ఇచ్చాడు. దీనికి అల్లు అరవింద్ కూడా వచ్చాడు.
అక్కడే తన మనసులో మాట బయటపెట్టాడు ఈయన. రామ్ చరణ్‌ను చూస్తుంటే తనకు ఈర్ష్యగా ఉందని.. ఇలాంటి సినిమాను నిర్మించినందుకు అతడు అద్భుతాన్ని చేసాడని చెప్పాడు అరవింద్. ఇక ఈ కథ విన్నపుడు ముందు చిరంజీవి సైరా అంటే.. ఆ తర్వాత చరణ్ భయపడకుండా సైరా అన్నాడని గుర్తు చేసాడు ఈయన. సైరా నరసింహారెడ్డిని ప్రేక్షకులు కూడా సైరా అనడం ఆనందాన్నిచ్చే విషయమని.. దానికి చిత్రయూనిట్ అంతా కలిసి కష్టపడ్డారని చెప్పాడు అల్లు అరవింద్. ఏదేమైనా ఇలాంటి గొప్ప సినిమాను తాను తీయలేకపోయాననే బాధ.. ఈర్ష్య తోటి నిర్మాతగా తనకు మేనల్లుడు రామ్ చరణ్ ను చూస్తుంటే ఉందని చెప్పాడు ఈయన. ప్రస్తుతం ఈయన అల్లు అర్జున్ హీరోగా అల వైకుంఠపురములో సినిమాను నిర్మిస్తున్నాడు.