English   

అమ్మో సమంతా...మళ్ళీ గ్లామర్ షో

samantha
2019-10-11 10:08:43

ఏం మాయ చేశావే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైయిన సమంతా మొదటి సినిమాలోనే మూతి ముద్దులు పెట్టి యూత్ లో మంచి ఫాల్లోయింగ్ ని సంపాదించుకుంది. ఆ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడంతో అమ్మడికి ఆఫర్స్ పైన ఆఫర్స్ వచ్చి పడ్డాయి, చేసిన సినిమాలు అన్ని కూడా వరుస విజయాలను అందుకున్నాయి దాంతో స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగిపోయింది. అంతలోనే అక్కినేని కోడలు కూడా అయిపొయింది. పెళ్లి అయిన తరువాత సామ్ మరింత రెచ్చిపోయి హాట్ హాట్ గా ఫోటో షూట్స్ చేస్తుంది, అంతకుమించి అందాలను ఆరబోస్తోంది.

 కొన్నిరోజుల కిందట సమంత ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన బికినీ ఫోటోలు... పెద్ద దుమారమే రేపాయి. సోషల్ మీడియా ఫాలోయింగ్ విషయంలో టాలీవుడ్ స్టార్స్ ఎవ్వరికీ అందనంత ఎత్తులో ఉన్న ఈ క్రేజీ హీరోయిన్‌ను మామ నాగార్జున గట్టిగానే క్లాస్ తీసుకున్నాడని వార్తలు కూడా వచ్చాయి. అయితే మామ చెప్పినా పట్టించుకోని సమంత మరోసారి సోషల్ మీడియాలో బోల్డ్ ఫోటోలు పోస్ట్ చేసింది. 

క్లీవేజ్ అందాలు కనిపించేలా ఉన్న ఈ ఫోటోలను చూస్తే... సమంతలో ఏ మార్పు రాలేదని క్లారిటీ వచ్చేస్తోంది. వైట్‌ అండ్‌ నేవీ బ్లూ కలర్ తో ఓ టైప్‌ మోడ్రన్‌ డ్రస్‌ ధరించింది. చుక్కలు పొదిగిన ఆ బ్లూ టాప్‌ ట్రాన్స్‌పరెంట్ గా ఉంది. బోటమ్‌ మాత్రం వైట్‌ విత్‌ డిజైనర్‌ ప్యాటర్న్‌లో ఓ చిన్న క్లాత్‌ టవల్‌లా నడుముకి చుట్టినట్టుంది. సామ్ ఫోటో షూట్ మీద నెటిజన్ల నుండి మిశ్రమ స్పందన వస్తోంది. ప్రస్తుతం సమంత సినిమాల సంగతి పక్కన పెట్టి, వెబ్‌ సిరీస్‌పై దృష్టి పెట్టిందని తెలుస్తోంది.
 

More Related Stories