హ్యాపీ బర్త్ డే అమితాబ్ బచ్చన్

ప్రముఖ బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ 77 వ పుట్టినరోజు వేడుకలను ముంబైలోని అమితాబ్ అభిమానులు ఈరోజు ఘనంగా నిర్వహించారు. తమ అభిమాన నటుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపేందుకు ఫ్యాన్స్ పెద్ద సంఖ్యలో ముంబైలోని బిగ్ బీ నివాసానికి చేరుకుంటున్నారు. ఆయన జీవితం స్ఫూర్తి దాయకం. నిజానికి ఆయన ఆల్ ఇండియా రేడియోలో అనౌన్సర్‌గా పని చేద్దామంటే.. ‘నీ గొంతేమీ బాగోలేదని వెనక్కి పంపారు. నటుడు కావాలని దర్శకుల చుట్టూ తిరిగితే.. ‘నువ్వేమి హీరో అవుతావు.. పో..’ అని అవమానించారు.
అయినా సరే ఆయన నిరాశ చెందక నటుడు కావాలనే ఆయన తపన ముందు ఈ అవమానాలు మటుమాయం అయ్యాయి. అందుకే 1969లో ‘భువన్ షోమ్’తో మొదలైన ఆయన ప్రస్థానం నేటికీ కొనసాగుతోంది. తొలి సినిమాకే ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు అందుకున్నాడు అమితాబ్. అమితాబ్ అసలు పేరు ఇన్క్విలాబ్ శ్రీవాస్తవ. అమితాబ్ తండ్రి హరివంశ్ రాయ్ ఓ ప్రసిద్ధ కవి. ఇక 1973లో వచ్చిన జింజర్ సినిమాతో అమితాబ్ లైఫ్ మారిపోయింది ఆ మూవీ సూపర్ హిట్ వరసగా అవకాశాలు వచ్చాయి. తరువాత వచ్చిన షోలే సినిమా అయన కెరీర్లో ది బెస్ట్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది.
ఇక కూలి సినిమా షూటింగ్ సమయంలో అయన గాయపడ్డారు. దాదాపు సంవత్సరం పాటు నటనకు దూరంగా ఉన్నారు. అనంతరం చేసిన సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. అమితాబ్ బచ్చన్ ఓ ఆండీడెక్స్‌ట్రస్ ఆయన రెండు చేతులతో రాయలగల సమర్ధం ఉన్నవారు. అమితాబ్ సినిమాల్లోకి వచ్చాక వరుసగా 12 ఫ్లాప్ సినిమాలు ఎదురయ్యాయి. ఆ తర్వాత వచ్చిన ‘జంజీర్’ ఆయనకు కెరీర్లో తొలి హిట్ ఇచ్చింది. ఒకే నెలలో ఆయన నటించిన నాలుగు సినిమాలు విడుదలై హిట్ అయ్యాయి.
బాలీవుడ్ లో అత్యధిక డబుల్ రోల్స్‌లో నటించిన ఏకైక నటుడు అమితాబే అంటే ఆశ్చర్యం కలగాక మానదు. మేడమ్ టుస్సాడ్స్ వ్యా్క్స్ మ్యూజియంలో ఆయనకు మైనపు విగ్రహం ఉంది. ఆ ఘనత సాధించిన తొలి భారతీయ నటుడు ఆయనే. 1984వ సంవత్సరంలో రాజకీయాల్లోకి వచ్చి అలహాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేసి గెలిచారు. అయితే, మూడేళ్లకే అయన రాజీనామా చేశారు. ఆ తరువాత రాజకీయాల జోలికి వెళ్ళలేదు. బిగ్ బి ఇప్పటి వరకు 180 కి పైగా సినిమాల్లో నటించారు. ఆయన మరిన్ని పుట్టినరోజులు ఇలాగే జరుపుకోవాలని కోరుకుందాం.