English   

రప్ఫాడిస్తున్న రజినీకాంత్.. అజిత్ దర్శకుడితో తర్వాతి సినిమా.. 

Rajinikanth
2019-10-11 17:32:09

రజినీకాంత్ రచ్చ తట్టుకోలేక ఇప్పుడు కుర్ర హీరోలు కూడా బాబోయ్ అంటున్నారు.. లేకపోతే మరేంటి ఈయన సినిమాలు చేస్తున్న స్పీడ్ చూస్తుంటే వామ్మో అనిపిస్తుంది ఎవరికైనా. మూడేళ్ల కింద వరకు మూడేళ్లకో సినిమా చేయడానికి కూడా ఇబ్బంది పడిన రజినీకాంత్ ఇప్పుడు కొత్త ఉత్తేజంతో కనిపిస్తున్నాడు. ఏమైందో తెలియదు కానీ వరుసగా సినిమాలు ఒప్పుకుంటూ సంచలనాలు సృష్టిస్తున్నారు సూపర్ స్టార్. తాజాగా పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు సూపర్ స్టార్. మురుగదాస్ తెరకెక్కిస్తున్న దర్బార్ సినిమాలో రజనీకాంత్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు. అప్పుడెప్పుడో 25 ఏళ్ల కింద పోలీస్ డ్రెస్ వేసిన సూపర్ స్టార్ మళ్ళీ ఇన్నేళ్ళ తర్వాత అటు వైపుగా వెళుతున్నాడు. సర్కార్ సినిమా విజయంతో జోరుమీదున్న మురుగుదాస్.. రజనీకాంత్ సినిమాతో కచ్చితంగా సంచలనం సృష్టిస్తానంటున్నాడు. పైగా రజనీతో సినిమా చేయాలి అనేది మురుగుదాస్ కల. అది ఇన్నాళ్ల‌కు తీరబోతుంది. ఇక ఇప్పుడు ఈ సినిమా సెట్స్ పై ఉండగానే తర్వాతి సినిమాకు కూడా ముహూర్తం పెట్టేసాడు రజినీ. తర్వాతి సినిమాను సిరుత్తై శివతో చేయబోతున్నాడు. అజిత్ తో వీరమ్, వివేగం, వేదాళం, విశ్వాసం లాంటి సినిమాలు చేసిన శివతో ఇప్పుడు రజినీ సినిమా చేయబోతున్నాడు. సన్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని నిర్మించబోతుంది. దీనిపై ఇప్పుడు కన్ఫర్మేషన్ కూడా వచ్చింది. మొత్తానికి 70 ఏళ్ల వయసులో రజినీ జోరు చూసి అంతా ఫిదా అయిపోతున్నారు. 
 

More Related Stories