English   

జెనీలియా మళ్లీ వచ్చేస్తుందోచ్.. హాట్ ఫోటోస్ పంపింది.. 

 Genelia Dsouza
2019-10-11 18:22:47

జెనీలియా.. బొమ్మరిల్లు సినిమాలో హాహా హాసిని అంటూ తెలుగు ప్రేక్షకులను మైమరిపించిన బ్యూటీ. ఆ సినిమాలో అమ్మడుకు ఎంత మంచి మనసు ఉందో బయట కూడా అంతే మంచి మనసు చూపిస్తుంది. ఈ మధ్యే మహారాష్ట్ర వరద బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధికి 25 లక్షలు విరాళం ఇచ్చి వార్తల్లో నిలిచింది ఈ మాజీ హీరోయిన్. ఇక ఇప్పుడు భర్త రితేష్ దేశ్ ముఖ్ తో కలిసి నటించడానికి మంచి కథ కోసం చూస్తున్నానని చెప్పింది. దానికితోడు హాట్ ఫోటోషూట్ కూడా చేసి విడుదల చేసింది జెన్నీ బేబీ. ఇద్దరు పిల్లల తల్లి అయిన తర్వాత కూడా తనలో ఏ మాత్రం అందం తగ్గలేదని నిరూపించుకుంటుంది జెనీలియా. ఇప్పుడు ఈ ఫోటోలు సోషల్ మీడియాలో బాగానే వైరల్ అవుతున్నాయి. కథ నచ్చితే తెలుగులో నటించడానికి కూడా సిద్ధమే అంటుంది జెన్నీ బేబీ. రానాతో నటించిన నా యిష్టం తర్వాత ఇక్కడ మళ్లీ సినిమాలు చేయలేదు. పెళ్లి తర్వాత తెలుగు సినిమాలకు పూర్తిగా బ్రేక్ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. ఇప్పుడు మళ్లీ వస్తానంటుంది. మరి హాసిని వస్తానంటే మాత్రం మనోళ్లు రానిస్తారా..? వస్తే అక్క వదిన పాత్రలు ఇస్తారా..? జెనీలియా రీ ఎంట్రీ ఇస్తే పరిస్థితి ఎలా ఉంటుదనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. 

More Related Stories