నాని కొత్త సినిమా....ఆ కాంబినేషన్ మళ్ళీ

ఈ ఏడాదిలో ఓ బేబీ సినిమా చేసి సూపర్ హిట్ అందుకుంది డైరెక్టర్ నందినిరెడ్డి. ఇక ఆమె తన తదుపరి సినిమా మీద ద్రుష్టి పెట్టింది. గత ఏడాది మహానటి వంటి బ్లాక్ బస్టర్ సినిమాని నిర్మించిన స్వప్న సినిమా సంస్థ ప్రస్తుతం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందిస్తోంది. ఆ సినిమాతో పాటు ఈ బ్యానర్ లో నందిని రెడ్డి సినిమా కూడా రూపొందనుందని అంటున్నారు. కథ కూడా ఓకే అయిపోయిందని ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరగుతోందని సమాచారం. ఈ కథ నాని కోసమే రెడీ అవుతున్నట్టు చెబుతున్నారు.
నాని నందిని రెడ్డి కాంబినేషన్లో అలా మొదలైంది సినిమా వచ్చింది. దర్శకురాలిగా నందినికి అదే తొలి సినిమా అయినా ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడమే కాక నానికి నందినికి మంచి పేరు తెచ్చిపెట్టింది. నందిని రెడ్డితో ఓసినిమా ఉంటుందని ప్రియాంక దత్, స్వప్న దత్ గతంలోనే ప్రకటించారు. కానీ హీరో ఎవరో చెప్పలేదు. ఇప్పుడు ఆ హీరో నానినే అని అంటున్నారు. మిక్కీ జె.మేయర్ సంగీత సారథ్యం వహించనున్న ఈ సినిమాకు లక్ష్మీ భూపాల్ రచయితగా వ్యవహరిస్తూన్నారు. త్వరలోనే సినిమా ప్రారంభం కానుందని అంటున్నారు.