వంశీ పైడిపల్లికి మినిమం రెండేళ్లు కావాల్సిందేనా

సినిమా సినిమాకు మినిమం రెండేళ్లు గ్యాప్ తీసుకోకపోతే.. వంశీ పైడిపల్లికి నిద్ర పట్టదనుకుంటా. ఆయన ట్రాక్ రికార్డ్ చూస్తే అదే అనిపిస్తోంది. పరిగెత్తి పాలు తాగడం కంటే నిలబడి నీళ్ళు తాగడం నయం అనుకున్నాడో ఏమో కానీ చాలా స్టడీగా ముందుకు వెళ్తున్నాడు వంశీ. మహర్షి హిట్ తర్వాత మహేశ్ అనిల్ రావిపూడి డైరెక్షన్లో ""సరిలేరు నీకెవ్వరు''లో జాయిన్ అయ్యాడు. మరి దర్శకుడు వంశీ పైడిపల్లి ఏ హీరోను డైరెక్ట్ చేస్తాడనే అనుమానాలు మొదలయ్యాయి.
అయితే ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న రామ్‌చరణ్ దాని తర్వాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నటిస్తారని ప్రచారం జరుగుతోంది. వంశీ చెప్పిన విభిన్నమైన పాయింట్ నచ్చి రామ్‌చరణ్ తదుపరి చిత్రానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారట. గతంలో వీరి కాంబినేషన్లో వచ్చిన ఎవడు సినిమా సక్సెస్ కావటంతో నెక్ట్స్ ప్రాజెక్ట్‌పై అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కడానికి మాత్రం చాలా సమయం పట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్ పనుల్లో బిజీగా ఉన్నాడు చెర్రీ.
ఈ సినిమా 2020 జూలైలో రిలీజ్‌కానుంది. అంటే అప్పటి వరకు చరణ్ బిజీగా ఉంటాడు. ఆ తరువాతే వంశీ, చరణ్ కాంబినేషన్లో సినిమా పట్టాలెక్కే అవకాశం ఉంది. చరణ్ ఇప్పటి వరకు తను పనిచేసిన దర్శకుల్లో మొదటి సారి టైమ్ రాజమౌళితో రెండోసారి పనిచేస్తున్నాడు. ఇపుడు అదే రూట్లో తనకు ‘ఎవడు’ వంటి మంచి సక్సెస్ ఇచ్చిన వంశీ పైడిపల్లితో రెండోసారి పనిచేయడానికి రెడీ అవుతున్నాడు. రామ్ చరణ్, వంశీ పైడిపల్లి సినిమాపై క్లారిటీ రావాలంటే అఫీషియల్ ప్రకటన వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సిందే.