English   

హన్సిక పాలిట విలన్ గా మారిన శ్రీ శాంత్

Sreeshanth
2019-10-12 11:11:07

క్రికెటర్ గా కెరీర్‌ బాగా సాగుతున్న సమయంలోనే అనేక వివాదాల్లో చిక్కుకుని ఆ క్రికెట్ కి దూరం అయ్యాడు శ్రీశాంత్‌. చాలా సంవత్సరాల తరువాత అతని మీద ఉన్న కేసును సుప్రీం కొట్టి వేసింది. క్రికెట్‌లో అతనిపై ఉన్న జీవితకాలపు నిషేధాన్ని కూడా ఎత్తివేసింది. అయితే అప్పటికే ఆయన క్రికెట్ కెరీర్ కి దాదాపు ముగుసిపోయింది. అయితే ఆ మధ్య ఒక సినిమాలో లీడ్ రోల్ చేసినా అది పెద్దగా గుర్తింపు ఇవ్వలేదు. ఇక ఈ సమయంలోనే మరో బంపర్‌ ఆఫర్‌ వచ్చింది శ్రీశాంత్‌కి. ఇప్పుడు ఆయన తమిళంలో నటించడానికి సిద్ధం అవుతున్నాడు.

 దేశముదురు హన్సిక హీరోయిన్ గా హరి శంకర్‌-హరీష్‌ నారాయణ్‌ లు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో విలన్ రోల్ లో నటించనున్నాడని అంటున్నారు. హారర్‌ కామెడీ జోనర్‌లో ఈ మూవీ తెరకెక్కనుందని సమాచారం.  డిసెంబరులో షాట్ కి వెళ్లనున్న ఈ సినిమాని వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేయడానికి ప్లాన్‌ చేశారు మేకర్స్. ప్రస్తుతం ఓ వెబ్‌ సిరీస్‌ షూట్ లో భాగంగా ముంబైలో ఉన్నారట హన్సిక. ‘పిల్ల జమీందార్‌’, ‘భాగమతి’ చిత్రాల దర్శకుడు జి. అశోక్‌ ఈ వెబ్‌ సిరీస్‌ ని తెరకెక్కిస్తున్నారు. ఘట్టమనేని మంజుల దీనికి నిర్మాత. ప్రస్తుతం ఈ భామ తెలుగులో నటించిన ‘తెనాలి రామక్రిష్ణ ఎల్‌ఎల్‌బీ’ విడుదలకు సిద్ధంగా ఉంది.

More Related Stories